
పయనించే సూర్యుడు న్యూస్ ఆగస్టు 12.08.2025 చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలం ప్రతినిధి జె. నాగరాజ)
బోయకొండ దేవస్థానం చైర్మన్ పదవి వాల్మీకులకు కేటాయించాలని వాల్మీకి మహాసేన వ్యవస్థాపకులు ముత్తారాశి హరికృష్ణ ఆధ్వర్యంలో బోయకొండ గంగమ్మ దేవస్థానం నందు అమ్మవారికి వినతి పత్రం సమర్పించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన బోయకొండ ఆలయ చైర్మన్ పదవిని వాల్మీకిలకే కేటాయించాలని డిమాండ్ చేశారు. అంతేకాక వాల్మీకి మహాసేన 2012 సంవత్సరం నుండి ఎన్నో ధర్నాలు రాస్తారోకోలు నిరవధిక సమ్మెలు కలెక్టరేట్ ముట్టడి, కార్యక్రమాలు చేశారు అతి తక్కువ కాలంలోనే ఎన్నో ఉద్యమాలు వాల్మీకుల చేశారు. వాల్మీకి మహాసేన న్యాయమైన కోరిక ప్రభుత్వ పాలకులు అధికారులను డిమాండ్ చేస్తుంది. వాళ్ల స్వార్థం కోసం వాల్మీకుల కు బోయకొండ చైర్మన్ పదవిని ఇస్తాం అంటున్నారే తప్ప ఇచ్చిన దాఖలాలు లేవు పదవి కావాలంటే అధికారం కావాలంటే ఆర్థికంగా డబ్బు ఉండే వాళ్లకు పదవి ఇస్తున్నారే తప్ప మా వాల్మీకులకు న్యాయం చేయలేదు ప్రస్తుత ప్రభుత్వం కూటమి పార్టీ లకు సేవ చేసే ఎంతోమంది వాల్మీకులు పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటికీ 90 శాతం పార్టీలోనే కొనసాగుతున్నారు . ఇలా మా మా వాల్మీకులు ప్రతి పార్టీకి బలోపేతానికి ఉపయోగపడుతూనే ఉన్నారు ఎన్ని ప్రభుత్వాలు మారిన మా వాల్మీకులకు న్యాయం చేకూరలేదు. బోయల ఆరాధ్య దైవమైన బోయకొండ చైర్మన్ పదవిని వాల్మీకి బోయ తలారి కులాల వారికి ఇవ్వాలని వాల్మీకి మహాసేన డిమాండ్ వాల్మీకులు యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా ప్రభుత్వాలు ఉన్నాయని తెలిపారు బోయకొండ చైర్మన్ పదవిని వాల్మీకి బోయలకే ఇస్తారని వాల్మీకి మహాసేన ఆశిస్తుంది అలా చేయని యెడల పల్లె గ్రామాల నుండి పట్టణాలు జిల్లాలు కలుపుకొని ప్రతి వాల్మీకి బిడ్డ తెగించి ఉద్యమాలు, ధర్నాలు, చేసి అయినా సరే చైర్మన్ పదవిని దక్కించుకుంటామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో వాల్మీకి మహాసేన రాష్ట్ర వ్యవస్థాపకులు ముత్తారాశి హరికృష్ణ మరియు రాష్ట్ర గౌరవ అధ్యక్షులు విజయ్ కుమార్, జిల్లా అధ్యక్షుడు అన్నమయ్య జిల్లా డాక్టర్ దేవరెంటి సుధాకర్, వాల్మీకి మహాసేన నాయకులు చంగల్ రాయుడు, మిద్దింటి రవి కిషోర్, బొంత శ్రీనివాసులు, బొంత గోపాల్, చిప్పిలి చినరాయుడు, లింగ చలపతి, నాని, సుదర్శన్, అంజి, రాజేష్, తదితరులు పాల్గొన్నారు.
