
పయనించే సూర్యుడు// న్యూస్ ఏప్రిల్ 16// మక్తల్ ప్రతినిధి సీ తిమ్మప్ప//
వరంగల్ లో ఈ నెల 27న జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు ముమ్మరంగా కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మక్తల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ప్రచార హోరు కొనసాగుతోంది. మక్తల్ నియోజకవర్గం ఆత్మకూరు, అమరచింత మున్సిపాలిటీ, నర్వ, కృష్ణా, మాగనూర్ మండల కేంద్రాల్లో వాల్ రైటింగ్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. బుధవారం మక్తల్ పట్టణ కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్ రెడ్డి స్వయంగా గోడలపై వాల్ రైటింగ్ చేసి కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పి నర్సింహగౌడ్ తోపాటు ఇతర బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్ రెడ్డి మాట్లాడుతూ “బీఆర్ఎస్ పార్టీ 25 ఏళ్ల ప్రస్థానాన్ని పురస్కరించుకుని వరంగల్ లో నిర్వహిస్తున్న రజతోత్సవ సభను జయప్రదం చేసేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలి. మక్తల్ నియోజకవర్గం నుండి భారీ సంఖ్యలో తరలివచ్చి సభను విజయవంతం చేయాలి” అని పిలుపునిచ్చారు.
