
కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి బూడిది గోపి
పయనించే సూర్యుడు ఆగస్టు 26 (జనగాం ప్రతినిధి కమ్మగారి నాగన్న)తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన బ్రాందీ షాపుల టెండర్ లో గీత కార్మికులకు 25 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ గౌడలకు వ్యక్తిగతంగా కాకుండా కల్లుగీత సహకార సంఘాలకు బ్రాందీ షాపులు కేటాయించాలని దీనివల్ల ఎక్కువ మంది గీత కార్మికులకు లబ్ధి చేకూరుతుందని తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి బూడిద గోపి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు
సోమవారం నారాయణఖేడ్ పట్టణంలోని అంబేద్కర్ భవనంలో సంగారెడ్డి జిల్లా కల్లుగీత కార్మిక సంఘం ఉపాధ్యక్షులు ఏ అంజాగౌడ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో జరిగిన విషయాలను పయనించే సూర్యుడు జనగాం ప్రతినిధితో మాట్లాడుతూఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా బ్రాండ్ షాపుల నిర్వహణలో గీత కార్మికులకు 25 శాతం టెండర్లలో రిజర్వేషన్ కల్పించే విధంగా అలాగే సొసైటీలకు అప్పగించాలని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన జీవో సవరణ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.గత సంవత్సరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లష్కర్ లో కాటమయ్య రక్షణ కిట్టు పంపిణీ సందర్భంగా హామీ ఇచ్చిన ప్రకారం గీతలు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని తాటి ఈత చెట్ల పెంపకానికి 560 జీవో ప్రకారం ప్రతి గ్రామానికి 5 ఎకరాల భూమి ఇవ్వాలని అలాగే చెరువు కుంటలు కట్టల కుంట మొక్కలు నాటాలని ప్రైవేటు వెంచర్లలో లేఅవుట్ నిబంధనలో తాటిగిత చెట్లు పెంచే విధంగా చర్యలు చేపడతామన్న హామీని నిలబెట్టుకోవాలని వృత్తి పెన్షన్ను 5 వేలకు పెంచాలని కల్లుగీత కార్పొరేషన్ కు 5000 కోట్ల రూపాయల నిధులు కేటాయించి తెలంగాణ రాష్ట్రంలోని గీత కార్మికుల సంక్షేమానికి కృషి చేయాలని నీరా ప్రాజెక్టును హైదరాబాద్ కే పరిమితం కాకుండా జిల్లాలో నియోజకవర్గ స్థాయి వరకు విస్తరించి చదువుకున్న గౌడ నిరుద్యోగ యువతకు శిక్షణ ఇచ్చి తాటి ఈత ఉత్పత్తులు ప్రోత్సహించి కల్లుగీత వృత్తిలోకి కొత్త తరం వచ్చే విధంగా చర్యలు చేపట్టాలని బెల్ట్ బ్రాందీ షాపుల వల్ల కల్లుగీత వృత్తి దెబ్బ తింటుందని వృత్తి ఉపాధి పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం బెల్ట్ షాపులను నిరోధించి కల్లులో ఉన్న పోషక విలువలను ప్రభుత్వమే ప్రచారం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈకార్యక్రమంలో నారాయణఖేడ్ డివిజన్ అధ్యక్షులు సిహెచ్ భూమా గౌడ్ ఉపాధ్యక్షులు గోగుకుల లక్ష్మా గౌడ్ నారాయణఖేడ్ మండల నాయకులు ఈడిగి రామా గౌడ్ ఈడికి యాదగిరి గౌడ్ నిజాంపేట్ మండల నాయకులు ఈడిగి బాగా గౌడ్ అలిగే జీవన్ తదితరులు పాల్గొన్నారు