పయనించే సూర్యుడు జనవరి 12( పాల్వంచ టౌన్ ప్రతినిధి గడ్డం నరహరి) పాల్వంచ రూరల్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలోని కేశవా పురం- జగన్నాధపురం గ్రామాల మధ్య వెలసి యున్న శ్రీ కనకదుర్గమ్మ దేవస్థానం( పెద్దమ్మ తల్లి గుడి)కి ఆదివారం సెలవు దినం కావడం వలన మండలంలోని పరిసర గ్రామాల గ్రామాల నుండే కాక ఇతర జిల్లాల నుండే కాక మరియు సరి హద్దు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకున్నారు. దీంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. క్యూ లైన్ ద్వారా అమ్మవారిని దర్శించు కో నీ తల నీలాలు సమర్పించుకున్నారు.అర్చకులు విశేష పూజలు జరిపారు .భక్తులు అన్న ప్రాసనలు, ఒడి బియ్యం పసుపు కుంకుమలు చీరలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. పూజా కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు.