
భగత్ సింగ్ వాల్ పోస్టర్స్ ఆవిష్కరన.
పయనించే సూర్యడు // మార్చ్ // 23 // కుమార్ యాదవ్.. ( హుజురాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ )..
భారత స్వతంత్ర సంగ్రామంలో వందలాదిగా ఉద్భవించిన సాయుధ విప్లవ వీరులలో భగత్ సింగ్,రాజగురు, సుఖదేవ్ లు ప్రత్యేకతను సొంతం చేసుకున్నారని, భారతదేశం ఎదుర్కొంటున్న సమస్య లను మార్క్సిజాన్ని జోడించి విశ్లేషించిన మహ మెదడు ను దేశం కోల్పోయిందని భగత్ సింగ్ 94వ వర్ధంతి సందర్భంగా అంగిడి దేవేందర్ అన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ..సామ్రాజ్యవాదానికి, పెట్టుబడుదారి విధానానికి, కులతత్వానికి,మతతత్వానికి వ్యతిరేకంగా పోరాడే భారత ప్రజలకు భగత్ సింగ్ నిరంతర పోరాట స్ఫూర్తిదాయకమని వారు అన్నారు. నేడు భారతదేశం హిందుత్వ ఫాసిజం తో ప్రత్యేకమైన పరిస్థితిని ఎదుర్కొంటుందని భగత్ సింగ్ అతని సహచరులు రాజగురు,సుఖ దేవ్ లు ఏ విధంగా అయితే మతాన్ని పూర్తిగా వ్యక్తిగతమని ప్రకటించి మతాన్ని అన్ని స్థాయిల్లో తీవ్రంగా వ్యతిరేకించి మతం విషయంలో రాజీ పడిని శత్రువుల్లా వ్యవహరించారో, నేడు భారత విద్యార్థి, యువకులు వారి స్ఫూర్తిని కొనసాగించాల్సిన అవసరం ఉందని అన్నారు. నేడు దేశంలో ఒకే జాతి, ఒకే మతం, ఒకే భాష అంటు ఫెడరల్ సూత్రాలకు వ్యతిరేకంగా బిజెపి పాలన కొనసాగిస్తుందని అందులో భాగంగానే పార్లమెంట్ అభిప్రాయాలను సైతం లెక్కచేయకుండా నూతన జాతీయ విద్యా విధానం అమలు చేయడం కోసం స్కిల్ ఇండియా, పేరుతో బలవంతంగా ఆమోదించుకొని ప్రభుత్వ విద్యను బలిపీఠంపై ఎక్కిస్తుంది.అని యూనివర్సిటీల నూతన ముసాయిదాను తీసుకొచ్చి విశ్వవిద్యాలయాలలో పరిశోధక విద్యార్థులపై, ప్రజాస్వామ్య విలువలపై దాడి చేస్తుందన్నారు. దేశంలో కోట్లాది మంది విద్యార్థి యువకులను కంపెనీ యాజమాన్యాలకు బానిసలను అందించే విధంగా విద్యా వ్యవస్థ మార్చబోతుందన్నారు. బిజెపి అనుసరించే విధానాలపై నేటి విద్యార్థి యువకులు భగత్ సింగ్ రాజగురు,సుఖదేవుల స్ఫూర్తితో ప్రశ్నించి వ్యవస్థ మార్పు కోసం కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం లో పి డి ఎస్ యు విద్యార్థులు హర్ష రాజు విజయ్ సాయి హర్షవర్ధన్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.