
రక్తదాన శిబిరాన్ని జయప్రదం చేయండి
( పయనించే సూర్యుడు మార్చి 23 షాద్ నగర్ నియజకవర్గం ఇన్చార్జి నరేందర్ నాయక్)
షాద్ నగర్ : పట్టణంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా రక్తదోన శిబిరాన్ని నిర్వహిస్తున్నట్టు ప్రజాసంఘాల నాయకులు తెలిపారు *తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్, భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం. సిఐటియు. గిరిజన సంఘం,జన విజ్ఞాన వేదిక.మరియు వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఫరూక్ నగర్ ఎంపీడివో కార్యాలయం నందు ఉదయం తొమ్మిది గంటలకు రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తున్నట్టు ప్రజాసంఘాల నాయకులు తెలిపారు కాబట్టి స్థానిక యువత. విద్యార్థులు మేధావులు. విద్యావంతులు పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు సందర్భంగా దాతలు ముందుకు వచ్చి రక్తాన్ని దానం చేయాలని ప్రజా సంఘాల నాయకులు కోరారు స్వాతంత్ర సమరయోధుల ఆశయాలను ముందుకు తీసుకెళ్ళుటకు యువతకు వారు చూపిన బాట ఆదర్శనీయం.షాద్నగర్ ప్రభుత్వ ఆసుపత్రి వారు అవసరమైన వారికి రక్తం అందుబాటులో ఉంచడం కోసం దాతల నుండి రక్తాన్ని సేకరించుట జరుగుచున్నది. కావున దాతలు అధిక మొత్తంలో ముందుకు వచ్చి ఇట్టి కార్యక్రమంలో పాల్గొనాలని కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు ఎన్ రాజు ఏటూరి కురుమయ్య ఈశ్వర్ నాయక్ శ్రీను నాయక్ బిజిలి సత్యం రవికుమార్ రాజు ప్రవీణ్ శ్రీకాంత్ ఎస్ ఎఫ్ ఐ గంగారం పాల్గొన్నారు