
పయనించే సూర్యుడు రీపోట్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ అక్టోబర్ 14
జార్ఖండ్ రాష్ట్రం,రాంఛిలో భగవాన్ బిర్సాముండా సమాధిని సందర్శించిడం అదృష్టంగా భావిస్తున్నమని భారత్ ఆదివాసీపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మొట్టడం రాజబాబు అన్నారు.రాంఛీలో జరిగిన జాతీయ ఆదివాసీ సమావేశానికి హాజరై,స్వతంత్ర సమర యోధుడు భగవాన్ బిర్సాముండాను బ్రిటిష్ ప్రభుత్వం1900 సంవత్సరంలో బంధించిన జైలు(అదే జైలులో చనిపోయారు)ను దేశ స్వాతంత్ర్యం అనంతరం మ్యూజియంగా మార్చడం జరిగిందని, బిర్సాముండా చనిపోయిన జైలు గదిని సందర్శించి,మ్యూజియంలోగల ఆయన విగ్రహాన్ని,మిగతా ఆదివాసీ యోధుల విగ్రహాలను సందర్శించి అక్కడి నుండి బిర్సాముండా సమాధి వద్దకు చేరుకుని ఘనంగా నివాళులు అర్పించారు.బిర్సాముండా చనిపోయిన జైలును, ఆయన సమాధిని సందర్శించి ముండాజీకి ఘనంగా నివాళులు అర్పించడం జీవితంలో మర్చిపోలేని క్షణమని, అలాంటి మహా వీరుల త్యాగాల ఫలితమే నేడు ఆదివాసీలు అనుభవిస్తున్న రిజర్వేషన్లు,హక్కులు,చట్టాలని రాజబాబు అన్నారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి ఉమ్మల దుర్గారెడ్డి,రాజస్థాన్ ఆదివాసీ ప్రతినిధి అవిదేష్ గమేటి తదితరులు పాల్గొన్నారు.
