
గుల్లాకారి ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు సుష్మిత కనేరి జిల్లా పర్యటనలో బాంబో యూనిట్ పరిశీలన, అభివృద్ధి మార్గదర్శకంపై చర్చ
పయనించే సూర్యుడు ఏప్రిల్ 27 (పొనకంటి ఉపేందర్ రావు )
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్.వి.పాటిల్, ఆదేశాల మేరకు, జిల్లాలో గిరిజన సంప్రదాయ హస్తకళల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ చేపట్టబడుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా, గుల్లాకారి ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు శ్రీమతి సుష్మిత కనేరి 2025 ఏప్రిల్ 27న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్యటన చేపట్టారు. ఆమె దుగా జిల్లా కలెక్టర్ జితేష్.వి.పాటిల్ ను కలుసుకుని, గిరిజన హస్తకళల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై మార్గదర్శక ఆదేశాలు తీసుకున్నారు. తదనంతరం, చండ్రుగొండ మండలంలోని బెండలపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన బాంబో యూనిట్‌ను పరిశీలించారు. ఇక్కడి గిరిజన కళాకారులు రూపొందిస్తున్న వెదురు ఆధారిత సంప్రదాయ ఉత్పత్తుల తయారీని, నైపుణ్యాలను ప్రత్యక్షంగా సమీక్షించారు. బాంబో యూనిట్ పరిశీలన అనంతరం, సుష్మిత కనేరి గారు మళ్లీ కలెక్టర్ ను కలుసుకొని, గిరిజన కళాకారుల నైపుణ్యాభివృద్ధి, మార్కెట్ లింకేజ్, ఉత్పత్తుల బ్రాండింగ్, ప్రాచుర్యం కోసం తీసుకోవలసిన చర్యలపై విశ్లేషణాత్మకంగా చర్చించడం జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గిరిజన సంపదను ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందేలా చేయడానికి కలెక్టర్ ప్రణాళికాబద్ధంగా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని అధికారులు తెలిపారు. ఈ. కార్యక్రమంలో వెంకయ్య, APM (ఫామ్) DRDO కార్యాలయం, బెండలపాడు బాంబ్ ట్రస్ట్ , చైర్మన్. V. గభూషణం, బోర్డు అఫ్ డైరెక్టర్స్ B. Suresh , V. గోవర్ధన్ , M .కృష్ణయ్య.
పాల్గొన్నారు.