
పయనించే సూర్యుడు న్యూస్ అక్టోబర్ 1(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి)
యాడికి శ్రీ.వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి దసరా శరన్నవరాత్రులలో భాగంగా పదవరోజు శ్రీ భవానీ దేవి అలంకరణతో పాటు చండీ హోమము పూర్ణాహుతి ద్రవ్యాలు సమర్పించి హోమ కార్యక్రమము కూష్మాండం బలిదానము ఇచ్చి మొదటి రోజు ఏర్పాటు చేసిన కలిసేబు బిందెలను కదిలించి కలిస జలాలను భక్తులకు పంపిణీ చేశారు చండీ హోమంలో ఉపయోగించిన పదార్థాలతో రక్ష భక్తులకు పంపిణీ చేశారు రాత్రికి శ్రీ భవానీ దేవి అలంకరణలో వాసవి కన్యకా పరమేశ్వరుని అలంకరిస్తామని సంఘ పెద్దలు తెలియజేశారు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘ సభ్యులు పాల్గొన్నారు మహా మంగళ హారతులు ఇచ్చి తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.

