
పయనించే సూర్యుడు అక్టోబర్ 7 నంద్యాల జిల్లా రిపోర్టరు జి పెద్దన్న
వాల్మీకుల హక్కుల కోసం పార్లమెంట్ లో వినిపిస్థా.నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి భవిష్యత్ తరాలకు ఆదర్శ మూర్తి శ్రీరామచరిత్రను అందించిన ఆది కవి వాల్మీకి మహర్షి అని, వాల్మీకుల హక్కుల కోసం పార్లమెంట్ లో ప్రస్థావించి వాల్మీకులను ఎస్ టి జాబితాలో చేర్చేలా కృషి చేస్తానని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు.మంగళవారం శ్రీశైల మండలం సున్నిపెంట గ్రామం పోలేరమ్మ గుడి సమీపంలో మండల వాల్మీకి సంఘం సెక్రటరీ నల్లబోతుల మల్లికార్జున ఆధ్వర్యంలో వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ఆదికవి వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేశారు.అనంతరం ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి మాట్లాడుతూ వాల్మీకి మహర్షి చరిత్ర నేటితరం వారు తెలుసు కోవాల్సిన అవసరం ఉందని, ఆదర్శ మూర్తి శ్రీ రాముడు చరిత్రను భవిష్యత్తుతరాలకు అందించిన మహానుభావులు వాల్మీకి మహర్షి అన్నారు, వాల్మీకులను ఎస్ టి జాబితాలో చేర్చాలని తాను పార్లమెంట్ వేదిక ద్వారా మీకోసం పనిచేస్తున్నానని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి హామీ ఇచ్చారు. అనంతరం సున్నిపెంట పోలేరమ్మకు ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ప్రత్యేక పూజలు చేసి అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో వాల్మీకి సంఘ నాయకులు బోయ పక్కిరప్ప, దాసరి మల్లికార్జున, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
