
( పయనించే సూర్యుడు జూలై 25 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
శుక్రవారం ఢిల్లీలోని తల్కటోరా స్టేడియంలో పార్టీ ఓబీసీ సెల్ నిర్వహించిన ‘భాగీదారి న్యాయ్ సమ్మేళన్’లో షాద్ నగర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ చైర్మన్ వీర్లపల్లి శంకర్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ ఎంపీ,ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రసంగిస్తూ…కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలన్నింటిలో కుల గణన మరియు “జనాభా ఎక్స్-రే” నిర్వహణకు పార్టీ నిబద్ధతను ఆయన పునరుద్ఘాటించారు. మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ… కుల ఆధారిత జనాభా గణనను మరియు రిజర్వేషన్లపై 50% పరిమితిని తొలగించాలని డిమాండ్ చేశారు. విద్యాపరంగా వెనుకబడిన వారికి రిజర్వేషన్లు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ను కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి మల్లు భట్టి విక్రమార్క,మంత్రులు పొన్నం ప్రభాకర్,కొండ సురేఖ,వాకాటి శ్రీహరి,ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్,రాజ్ ఠాకూర్, ఎంపీ మల్లు రవి,మాజీ ఎంపీ హనుమంత్ రావు తదితరులు పాల్గొన్నారు.
