Tuesday, April 1, 2025
Homeఆంధ్రప్రదేశ్భారత దేశం గొప్ప విప్లవ వీరులను కోల్పోయిందిపి డి యస్ యూ, పి వై ఎల్

భారత దేశం గొప్ప విప్లవ వీరులను కోల్పోయిందిపి డి యస్ యూ, పి వై ఎల్

Listen to this article

పయనించె సూర్యుడు మార్చి 21 టేకులపల్లి ప్రతినిధి (పొనకంటి ఉపేందర్ రావు)

ఇల్లందుభారత స్వతంత్ర సంగ్రామంలో వందలాదిగా ఉద్భవించిన సాయుధ విప్లవ వీరులలో భగత్ సింగ్,రాజగురు, సుఖదేవ్ లు ప్రత్యేకతను సొంతం చేసుకున్నారని, భారతదేశం ఎదుర్కొంటున్న సమస్య లను మార్క్సిజాన్ని జోడించి విశ్లేషించిన మహ మెదడు ను దేశం కోల్పోయిందని పి డి యస్ యూ రాష్ట్ర అధ్యక్షులు కాంపాటి పృథ్వీ, పి వై ఎల్ రాష్ట్ర కార్యదర్శి వాంకుడోత్ అజయ్ అన్నారు.పి డి యస్ యూ ఆధ్వర్యంలో శుక్రవారం ఇల్లందు పట్టణంలో పి డి యస్ యూ రాష్ట్ర కమిటీ పిలుపు లో బాగంగా భగత్ సింగ్ 94వ వర్ధంతి సందర్భంగా పి డి యస్ యూ ఇల్లందు డివిజన్ కార్యదర్శి బానోత్ నరేందర్ అధ్యక్షతన సెమినార్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన కాంపాటి పృథ్వీ, వాంకుడోత్ అజయ్ మాట్లాడుతూ సామ్రాజ్యవాదానికి, పెట్టుబడుదారి విధానానికి, కులతత్వానికి,మతతత్వానికి వ్యతిరేకంగా పోరాడే భారత ప్రజలకు భగత్ సింగ్ నిరంతర పోరాట స్ఫూర్తిదాయకమని వారు అన్నారు. నేడు భారతదేశం హిందుత్వ ఫాసిజం తో ప్రత్యేకమైన పరిస్థితిని ఎదుర్కొంటుందని భగత్ సింగ్ అతని సహచరులు రాజగురు,సుఖ దేవ్ లు ఏ విధంగా అయితే మతాన్ని పూర్తిగా వ్యక్తిగతమని ప్రకటించి మతాన్ని అన్ని స్థాయిల్లో తీవ్రంగా వ్యతిరేకించి మతం విషయంలో రాజీ పడిని శత్రువుల్లా వ్యవహరించారో నేడు భారత విద్యార్థి, యువకులు వారి స్ఫూర్తిని కొనసాగించాల్సిన అవసరం ఉందని అన్నారు. నేడు దేశంలో ఒకే జాతి ఒకే మతం ఒకే భాష అంటు ఫెడరల్ సూత్రాలకు వ్యతిరేకంగా బిజెపి పాలన కొనసాగిస్తుందని అందులో భాగంగానే పార్లమెంట్ అభిప్రాయాలను సైతం లెక్కచేయకుండా నూతన జాతీయ విద్యా విధానం అమలు చేయడం కోసం స్కిల్ ఇండియా పేరుతో బలవంతంగా ఆమోదించుకొని ప్రభుత్వ విద్యను బలిపీఠంపై ఎక్కిస్తుంది. యూనివర్సిటీల నూతన ముసాయిదాను తీసుకొచ్చి విశ్వవిద్యాలయాలలో పరిశోధక విద్యార్థులపై, ప్రజాస్వామ్య విలువలపై దాడి చేస్తుంది. దేశంలో కోట్లాదిమంది విద్యార్థి యువకులను కంపెనీ యాజమాన్యాలకు బానిసలను అందించే విధంగా విద్యా వ్యవస్థ మార్చబోతుంది. వారన్నారు ఈ కార్యక్రమంలో పి వై ఎల్ జిల్లా నాయకులు మంగయ్య, పి డి యస్ యూ ఇల్లందు పట్టణ అధ్యక్ష కార్యదర్శులు బి.సాయి, పార్థసారథి,పట్టణ కోశాధికారి తరుణ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments