
పయనించే సూర్యుడు అక్టోబర్ 13,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి
నంద్యాల జిల్లాలో ఈ నెల 16 వ తేదీ గురువారం భారత ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పర్యటనను విజయవంతం చేద్దామని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి కోరారు. సోమవారం ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి మాట్లాడుతూ అష్టాదశ శక్తి పీఠం, ద్వాదశ జ్యోతిర్లింగం రెండూ ఒకేచోట ఉంటూ భూమికి నాభిలా భకైలాసంగా విరాజిల్లుతూ నిత్య పూజలు అందుకుంటూ రాష్ట్రంలోనే రెండవ ప్రముఖ పుణ్య క్షేత్రంగా నంద్యాల జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలానికి భారత ప్రధానమంత్రి రావడం ఎంతో శుభపరిణామమనీ, రాయలసీమ అభివృద్ధికి ప్రధానమంత్రి పర్యటన ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. శ్రీశైల శ్రీభ్రమరాంబ, మల్లికార్జున స్వామి వార్లకు భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రత్యేక పూజలు, దర్శనం అనంతరం నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గం ఓర్వకల్లు మండలం నన్నూరు వద్ద ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో జీఎస్టీ సంస్కరణలతో ప్రజలకు లబ్ది చేకూరే అంశం, రాయలసీమ అందులో నంద్యాల జిల్లా సమగ్రాభివృద్ధిపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రసంగించనున్నారని ఆమె తెలిపారు.
ఈ బహిరంగ సభ సుమారు 3 లక్షలకు పైగా ప్రజలతో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి చెప్పారు. రాయలసీమ, ఉమ్మడి కర్నూలు జిల్లా, ముఖ్యంగా నంద్యాల జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, బైరెడ్డి అనుచరులు అధిక సంఖ్యలో తరలివచ్చి భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ పర్యటనను విజయవంతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు.