
పయనించే సూర్యుడు అక్టోబర్ 7, నంద్యాల జిల్లా రిపోర్టరు జి. పెద్దన్న
- తన ఆహ్వానం మన్నించి శ్రీశైల శ్రీభ్రమరాంబ, మల్లికార్జున స్వామి వార్ల దర్శనంకు వస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీకీ ప్రత్యేక ధన్యవాదములు.
- నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి
- నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం నల్లమల అరణ్యంలోని ప్రముఖ శైవక్షేత్రం, అష్టాదశ శక్తి పీఠం, ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటై భూ కైలాసంగా విరాజిళ్లుతున్న శ్రీ భ్రమరాంబ, మల్లికార్జున స్వామి వార్లను తన ఆహ్వానం మేరకు దర్శనం చేసుకునేందుకు ఈ నెల 16 వ తేదీ గురువారం భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శ్రీశైలం వస్తున్నారని తన ఆహ్వానం మన్నించి శ్రీశైలం వస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకీ ప్రత్యేక ధన్యవాదములు తెలుపుతూ ప్రధానమంత్రి పర్యటనను విజయవంతం చేద్దామని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి కోరారు. మంగళవారం శ్రీశైల దేవస్థానం ట్రస్ట్ చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు, శ్రీశైల దేవస్థానం పాలకమండలి సభ్యులు మేడా మురళీధర్, రేఖా గౌడ్ లతో కలిసి ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి శ్రీశైల శ్రీ భ్రమరాంబ, మల్లికార్జున స్వామి వార్లను దర్శించుకున్నారు.దేవస్థానం అధికారులు ఆలయ మర్యాదలతో వీరికి స్వాగతం పలుకగా, అర్చకులు, వేదపండితులు ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి, చైర్మన్ రమేష్ నాయుడు, సభ్యులు మేడా మురళి, రేఖలకు స్వామి, అమ్మ వార్ల దర్శనం అనంతరం శేష వస్రాలతో సన్మానం చేసి, తీర్థ ప్రసాదం, స్వామి, అమ్మవార్ల చిత్రపటంలు అందించి ఆశీర్వదించారు.శ్రీశైలంలోనే ఉన్న బిజెపి రాష్ట్ర అధ్యక్షులు మాధవ్, నంద్యాల జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి, జిల్లా ఎస్ పి సునీల్ షేరాన్, శ్రీశైలదేవస్థానం ఈ ఓ శ్రీనివాసరావు, తదితర జిల్లా ఉన్నతాధికారులతో ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు, ఉమ్మడి ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉన్న టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు సమన్వయముతో భారత ప్రధాన మంత్రి నరేంద్రమోడీ శ్రీశైలం పర్యటనను విజయవంతం చేద్దాం అని కోరారు. ఇప్పటికే అమరావతిలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, దేవాదాయశాఖ మంత్రి ఆనం రామ నారాయణరెడ్డిలు, అన్ని శాఖల ఉన్నతాధికారులతో ప్రధాన మంత్రి శ్రీశైల పర్యటనవిజయవంతంపై సమీక్షా చేశారని, తిరుమల తిరుపతి దేవస్థానంలా శ్రీశైల దేవస్థానంను కూడా అభివృద్ధి చేసేందుకు, భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు అవసరమైన ప్రతిపాదనలు తయారు చేయాలనీ, ప్రధానమంత్రి ద్వారా శ్రీశైల దేవస్థానంకు సహాయ సహకారం, నిధులు కోరుదాం అని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు.