
ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య
- పయనించే సూర్యుడు ఏప్రిల్ 14 టేకులపల్లి ప్రతినిధి (పొనకంటి ఉపేందర్ రావు )
ఇల్లందు జెకె కాలనీ అంబేద్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే కోరం కనకయ్య అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు అనంతరం జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అంబేద్కర్ అందరివాడు అంబేద్కర్ రాజ్యాంగంలో పేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు పరితపించిన మహానుభావుడని కొనియాడారు. ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి జీవితాంతం పోరాడిన మేధావి అంబేద్కర్ అని అన్నారు. ఆయన అడుగుజాడల్లో నడవాలని సామాజిక అభివృద్ధికి పాటుపడాలని. బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం దేశ భవిష్యత్తుకు దిక్సూచిగా మారిందన్నారు. అణగారిన వర్గాల సంక్షేమం, మహిళల సాధికారత కోసం బాబా సాహెబ్ చేసిన అవిశ్రాంత పోరాటం ప్రపంచానికి స్ఫూర్తిదాయకమని కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సాధ్యం చేసిన అంబేద్కర్ రాజ్యాంగం ప్రజాపాలనకు దిక్సూచి అని గుర్తు చేశారు. మహనీయుని ఆశయాల స్ఫూర్తితో రాష్ట్ర ప్రభుత్వం ఎస్టీ, ఎస్సి, బిసి, మైనార్టీల అభ్యున్నతి కోసం ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ల పెంపు వంటి నిర్ణయాలతో సామాజిక న్యాయం కోసం కృషి చేస్తున్నాం. డాక్టర్ అంబేద్కర్ పేరిట నాలెడ్జ్ సెంటర్లు, యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ ద్వారా నాణ్యమైన విద్యను, రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా యువతకు స్వయం ఉపాధి అవకాశాలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. బాబా సాహెబ్ గారి స్వప్నాలను నిజం చేయడానికి అందరూ కలిసి నడవాలి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు సింగరేణి జనరల్ మేనేజర్ ఈసం కృష్ణయ్య, మాజీ మున్సిపల్ చైర్మన్ డివి, పట్టణ అధ్యక్షులు దొడ్డ డానియల్, కార్యదర్శి జాఫర్, నియోజకవర్గ నాయకులు మడుగు సాంబమూర్తి, బొల్లా సూర్యం, చిల్లా శ్రీనివాస్,INTUC నాయకులు, ఇల్లందు మున్సిపాలిటీ 24 వార్డుల ముఖ్య నాయకులు కార్యకర్తలు, మహిళా నాయకులు, యువజన నాయకులు,పట్టణ నాయకులు తదితరులు పాల్గొన్నారు