
పయనం చే సూర్యుడు మే 6 నిజామాబాద్ జిల్లా బ్యూరో టి కే గంగాధర్తె లంగాణ నిజాంబాద్ జిల్లాలో ఆర్మూర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి ప్రభాకర్
భారత రైతాంగానికి దేశ ప్రధాని రాతపూర్వకంగాఇచ్చిన హామీలను అమలు జరపాలని,, రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన గ్యారెంటి అమలుకై 8 మే రోజున హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద జరిగే ధర్నాను జయప్రదం చేయండి… ఏ ఐ యు కె ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.. వి ప్రభాకర్..అఖిలభారత ఐక్య రైతు సంఘం. ఏ ఐ యు కె ఎస్ ఆధ్వర్యంలో 8 మే హైదరాబాదు ఇందిరాపార్క్ వద్ద జరిగే ధర్నాను రైతాంగం జయప్రదం చేయాలని విజ్ఞప్తి..కుమార్ నారాయణ భవన్ ఏ ఐ యు కె ఎస్. పాత్రికేయ మిత్రుల సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.. ప్రభాకర్. కార్యదర్శి. బి దేవారం లు మాట్లాడుతూ..రైతాంగ వ్యతిరేక మూడు నల్ల చట్టాలను తెచ్చి మోడీ సర్కార్ వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తుల కు దారదర్తం చేయడానికి ప్రయత్నిస్తే రైతాంగం ఐక్యంగా 16 నెలలు ఢిల్లీ కేంద్రంగా ఉద్యమం సాగించింది అని అన్నారు.. ఈ పోరాటంలో 750 మంది రైతులు అమరత్వం పొందారని గుర్తు చేసుకున్నారు…సుదీర్ఘంగా జరిగిన పోరాటాల ఫలితంగా దేశ ప్రధాని భారత రైతాంగానికి క్షమాపణచెప్పి రైతాంగ వ్యతిరేక చట్టాలను రద్దు చేస్తానని,, ఎం ఎస్ పి గ్యారెంటీ చట్టాన్ని తెస్తానని.. రైతులపై పెట్టిన కేసులు రద్దు చేస్తానని,, కేంద్రం తెచ్చిన విద్యుత్ సవరణ బిల్లును రద్దు చేస్తారని రాతపూర్వకంగా నిండు పార్లమెంట్లో హామీ ఇచ్చి రైతులకు ద్రోహం చేశారని అన్నారు…తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి 7 గ్యారెంటీలను ప్రకటించారు. అందులో ముఖ్యంగా వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేస్తున్నామని అన్ని పంటలకు క్వింటాలకు 500 రూపాయలు బోనసిస్తానని చెప్పి ఒక సన్నధాన్యానికే పరిమితం చేసి చేతులు దులుపుకున్నారని ఎద్దేవా చేశారు.. ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తానని 40 శాతం మాత్రమే పరిపూర్తి చేసి 60% రైతాంగానికి ద్రోహం చేశారని,, రైతు భరోసా రెండు పంటలకు 15000 ఇస్తారని 12 వేలకే కుదించి కొద్ది మందికి మాత్రమే ఇచ్చి తన చేతగానితనాన్ని రుజువు చేసుకున్నాడని అన్నారు.. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను అమలు చేయించుకోవడం కోసం 8 మే రోజున హైదరాబాద్ ధర్నా చౌక్ లో (ఇందిరా పార్క్) జరిగే ధర్నాలు జయప్రదం చేయాలని రైతాంగానికి పిలుపునిచ్చారు..
ఈ సమావేశంలో అఖిల భారత ఐక్య రైతు సంఘం. జిల్లా డివిజన్ నాయకులు.. యు రాజన్న.. బి కిషన్.. కె గంగారాం. ఏ లింబాద్రి . టీ. నరేష్ తదితరులు పాల్గొన్నారు.
