
వేలం పాటలో 6,70,000 లకు దక్కించుకున్న యువ నాయకుడు రాజు నాయక్
35, 500 లకు రెండో లడ్డును దక్కించుకున్న దేవేందర్
( పయనించే సూర్యుడు సెప్టెంబర్ 04 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
ఫరూక్నగర్ మండలం కడియాల కుంట తండ పరిధిలోని బూరుగడ్డ తండాలో వినాయకుడి లడ్డు భారీ ధర పలికింది. ముందు పెన్నడు లేని విధంగా బూరుగడ్డ తండకు చెందిన మూడవత్ రాజు తండ్రి మూడవత్ తేజ్య 6 లక్షల 70 వేల రూపాయలకు వినాయకుడి లడ్డూను దక్కించుకున్నారు. తండ చరిత్రలో ఇంత భారీ ధర పలకడం ఇదే మొదటిసారి కావడంతో కమిటీ సభ్యులు తండ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా లడ్డు దక్కించుకున్న రాజు నాయకులు తాండ పెద్దలు మరియు వినాయక కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. అనంతరం రాజు నాయక్ మాట్లాడుతూ… తన యొక్క కోరికలను ఆ విగ్నేశ్వరుడు తీర్చాలని ఎల్లవేళలా తనకు ఆ విగ్నేశ్వరుడి అండ దండాలు ఉండాలని రాజు నాయక్ అన్నారు. మరో లడ్డును నేనావత్ దేవేందర్ తండ్రి నేనావత్ గొన్య 35,500 రూపాయలకు దక్కించుకున్నారు. ఈ కార్యక్రమంలో వినాయక కమిటీ సభ్యులు తండా పెద్దలు యువకులు తదితరులు పాల్గొన్నారు.
