పరాయి వ్యక్తితో సహజీవనమే దీనికి కారణమా ?
పయనించే సూర్యుడు అక్టోబర్ 24 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్
ఏన్కూరు మండలం కాలనీ నాచారం గ్రామంలో శుక్రవారం ఉదయం జరిగిన సంఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. భార్య పరాయి వ్యక్తితో సహజీవనం చేయడం భరించలేని భర్త ఆమెను గొడ్డలితో నరికి చంపిన ఘటన శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కాలనీ నాచారం గ్రామానికి చెందిన తాటి రామారావు, తాటి గోవర్షిని భార్యాభర్తలు, వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. గోవర్షిని అదే గ్రామానికి చెందిన అఖిల్ అలియాస్ ఆదామ్ అనే యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. సుమారు ఎనిమిది నెలల క్రితం భర్త, పిల్లలను వదిలిపెట్టి ఆమె అఖిల్‌తో సహజీవనం చేస్తూ పారిపోయింది.
ఈ నేపథ్యంలో రామారావు భార్యను పలుమార్లు ఇంటికి పిలుచుకుని వచ్చినా, ఆమె మళ్లీ అఖిల్ వద్దకే వెళ్లిపోయేది. సుమారు మూడు రోజుల క్రితం, పాల్వంచలో చదువుతున్న తమ కూతురును చూడడానికి గోవర్షిని వచ్చింది. ఈ సమయంలో రామారావు తన భార్యను పట్టుకొని ఇంటికి (కాలనీ నాచారం) పిలుచుకుని వచ్చాడు. తనతో ఉండడానికి భార్య నిరాకరించడంతో శుక్రవారం ఉదయం సుమారు నాలుగు గంటల ప్రాంతంలో ఇంటి బయట ఆవరణలో గోవర్షిని నిద్రిస్తుండగా, రామారావు గొడ్డలితో ఆమె తలపై నరికాడు. దీంతో గోవర్షిని అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏన్కూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాలు, వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణమా లేక వేరే అంశాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు

