
పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్ తెలంగాణ నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో భీంగల్
పట్టణంలోని మూడో వార్డులోని నంది గుడి వద్ద భీంగల్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో బతుకమ్మ పండగ ఏర్పాట్లు చేయడం జరిగిందని కమిషనర్ గోపు గంగాధర్ తెలిపారు. మున్సిపాలిటీ ఆధ్వర్యంలో లైటింగ్ మరియు సౌండ్ సిస్టం మరియు కుర్చీలు మరియు సైడ్ వాళ్ళు మరియు ఎల్ఈడి స్క్రీన్ మరియు గ్రీన్ మ్యాట్లు మరియు తాగడానికి మంచినీరు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. బతుకమ్మ పండుగ వచ్చే ఆడపడుచులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. అలాగే గురువారం జరగనున్న దసరా ఏర్పాట్లు చేయాలని సిబ్బందిని కమిషనర్ ఆదేశించారు. ప్రజా ప్రతినిధులతో కలిసి బతుకమ్మ ఏర్పాట్లను పరిశీలించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ నరేందర్ వార్డ్ ఆఫీసర్లు మున్సిపల్ సిబ్బంది ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు
