పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్
తెలంగాణ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో భీంగల్ మున్సిపల్ పరిధిలో
పట్టణంలోని బస్టాండ్ ప్రాంతంలో ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తున్న పండ్లు అమ్మేవారు మరియు కూరగాయలు అమ్మేవారికి మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్. ఎస్సై సందీప్ బుధవారం అవగాహన కల్పించారు. తరచుగా బస్టాండ్ ప్రాంతంలో ప్రమాదాలు జరుగుతున్నందున ట్రాఫిక్అంతరాయం కలిగిస్తే చర్యలు తీసుకుంటామన్నారు . తదంతరం పండ్లు అమ్మేవారిని మరియు కూరగాయలు అమ్మేవారిని అనువైన స్థలం లకు మార్చడం జరుగుతుందని వారికి తెలిపారు. ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తే చర్యలు తీసుకోబడతాయని వారిని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో టౌన్ ప్లానర్ ఆంజనేయులు. మేనేజర్ నరేందర్ మున్సిపల్ సిబ్బంది పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

