
పయనించే సూర్యుడు నిజాంబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్ తెలంగాణ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో
భీంగల్ మండల కేంద్రం,గోన్ గొప్పుల మరియు సికింద్రాపూర్ గ్రామాలలో వరద ప్రభావిత ప్రాంతాలలొ పర్యటించి భారీ వరద దాటికి ధ్వంసమైన రోడ్లు మరియు బ్రిడ్జ్ లు, పంట పొలాలను బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ పరిశీలించడం జరిగింది. ప్రజలకు, రవాణాకు ఇబ్బంది కలగకుండా రోడ్లు, బ్రిడ్జ్ ల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయవలసిందిగా ఆయన అధికారులకు సూచించారు. అలాగే పంట నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక అందించవలసిందిగా వ్యవసాయ అధికారులకు సూచించడం జరిగింది. ప్రజా ప్రభుత్వం ఇప్పటికే వరదల వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేసి పరిష్కార చర్యలు చేపట్టుటకు అధికార యంత్రాంగాన్ని ఆదేశించిందని ఆయన అన్నారు, స్వయంగా ముఖ్యమంత్రి గారే ఫీల్డ్ విజిట్స్ చేస్తూ అధికార యంత్రంగాన్ని పరుగులు పెట్టిస్తున్నారని అన్నారు. ఆయన తరుపున నియోజకవర్గంలో జరిగిన నష్టాలను సంబంధిత మంత్రులకు మరియు ముఖ్యమంత్రి కి నివేదిస్తానని తెలిపారు.కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
