Sunday, October 19, 2025
Homeఆంధ్రప్రదేశ్భీంగల్ మండలం బడా భీంగల్ గ్రామ బి ఆర్ ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే...

భీంగల్ మండలం బడా భీంగల్ గ్రామ బి ఆర్ ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి

Listen to this article

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టీ కే గంగాధర్ తెలంగాణ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో

30 9 25 మంగళవారం రోజున భీమ్గల్ మండలం బడా భీంగల్ గ్రామ బిఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి ప్రారంభించుకున్నటు వంటి కార్యకర్తలకు, నాయకులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు గ్రామస్థాయిలో పార్టీ ఆఫీసులు సాధారణంగా అసెంబ్లీ ఎన్నికల అప్పుడు ప్రారంభించడం జరుగుతుంది కానీ ఎన్నికలు ఇంకా మూడేళ్లు ఉన్నప్పుడే పార్టీ ఆఫీస్ ప్రారంభించారు అంటేనే ఎప్పుడు ఎన్నికలు వస్తాయా ? ఎప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించుదామా అని టిఆర్ఎస్ శ్రేణులు ప్రజలు ఎదురుచూస్తున్నారని అర్థమవుతుంది రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మోసపు మాటలు నమ్మి తెలంగాణ ప్రజలు బంగారం లాంటి కేసీఆర్ను కాదని రేవంత్ రెడ్డిని గద్దె నెక్కించారు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో అక్కడికి వచ్చిన మహిళలను మీకు తులం బంగారం వస్తుందా, 2500 వస్తున్నాయా 2000 పెన్షన్ 4000 అయ్యిందా అని అడిగితే మహిళలందరూ ముక్తకంఠంతో రేవంత్ రెడ్డి చెప్పిన అబద్ధపు హామీలు నమ్మి మోసపోయామని అన్నారు రేవంత్ రెడ్డి అధికారంలోకి రావడానికి అనేక హామీలు ఇచ్చి ప్రజలకు ఒక గ్యారెంటీ కార్డు ఇవ్వడం జరిగింది టిఆర్ఎస్ పార్టీ మరియు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఒక నిర్ణయం తీసుకుంది రేవంత్ రెడ్డి మోసపు హామీలు ఇచ్చి ప్రజలకు ఒక్కో హామీ ద్వారా ఎంతెంత బాకీ పడ్డాడో తెలియజేస్తూ కాంగ్రెస్ బాకీ కార్డును తయారు చేసాం ఆ కార్డులను కార్యకర్తలందరికీ పంపిస్తాం, ఆ బాకీ కార్డు ని తీసుకొని మీ గ్రామాల్లో ప్రతి ఇంటిలోకి వెల్లి ఒక్కో హామీ ద్వారా కాంగ్రెస్ పార్టీ ఏ వర్గానికి ఎవరికీ ఎంత బాకీ ఉందో ప్రజలకు తెలియజేయాలి ప్రతి మహిళకు 2500 ఇస్తామని రేవంత్ రెడ్డి అన్నాడు. 22 నెలలు గడిచింది ఇప్పటివరకు ప్రతి మహిళకు రేవంత్ రెడ్డి 55000 బాకీ పడ్డాడు కార్యకర్తలుగా ఈ విషయం ప్రతి మహిళకు చేరవేయాలి నేనొస్తే ప్రతి అవ్వకు తాత కు, బీడీ కార్మికులకు 2000 పెన్షన్ ను 4000 రూపాయలకు పెంచి పెన్షన్ ఇస్తాను అన్నాడు. గత 22 నెలలుగా అవ్వ తాతలకు, బీడీ కార్మికులకు రేవంత్ రెడ్డి 44000 బాకీ పడ్డాడు రైతులకు రైతుబంధు కింద ప్రతి ఎకరానికి 14000 నుండి 19 వేల వరకు బాకీ ఉన్నాడు రుణమాఫీ 2,00,000, క్వింటాలుకు 500 రూపాయల వడ్ల బోనస్ కింద ప్రతి ఎకరానికి 50,000 బాకీ ఉన్నాడు విద్యార్థులకు స్కూటీలు బాకీ ఉన్నాడు, మహిళలకు తులం బంగారం భాకి ఉన్నాడు ఉపాధి హమీ కూలీలకు,ఆటో డ్రైవర్ లకు సంవత్సరానికి 12,000 చొప్పున రెండేండ్లకు 24000 బాకీ ఉన్నాడు ఎవరైనా కాంగ్రెస్ నాయకులు ఇంటికి ప్రచారానికి వస్తే ఈ బాకీ కార్డు ను చూయించి రేవంత్ రెడ్డి మాకు బాకీ పడ్డ ఇస్తే కానీ ఓటు వేయము అనేలా ప్రజల్ని చైతన్యం చేయాలి.ఇది మంచి అవకాశం ఇలాంటి అవకాశం ఎక్కువగా రాదు. రాబోయే ఏ ఎన్నికలైన కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ముందర పెట్టి మాకు బాకీ పెట్టిన డబ్బులని ఇచ్చినాకనే ఓటేస్తామని నిలదీయాలి మా అక్క చెల్లెళ్లకు బతుకమ్మ చీరలు ఇచ్చే దిక్కు లేదు కానీ లక్షల కోట్లతో ఫ్యూచర్ సిటీ, లక్షన్నర కోట్లతో మూసి రివర్ ఫ్రంట్ చేస్తానని రేవంత్ రెడ్డి బుడ్డర్ ఖాన్ మాటలు మాట్లాడుతున్నాడు కెసిఆర్ ఇచ్చిన చీరలు ఏమో మంచిగా లేవు దుష్ప్రచారం చేశావు రెండు దసరాలు పోయిన ఒక చీర ఇయ్య శాత కాలేదు.మహిళా సంఘాలకు రెండు చీరలు ఇస్తానన్నావు బతుకమ్మ అయిపోయే దసరా రావట్టే అందుకే నీవి పిట్టలదొర మాటలు అనకపోతే ఏమనాలి.ఇలాంటి దొంగ హామీలు ఇచ్చిన వ్యక్తిని నిలదీసే అవసరం ఉంది. ప్రజల పక్షాన పోరాటానికి బిఆర్ఎస్ పార్టీ సైనికులు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు.కానీ ప్రజలుగా మాత్రం మీ ఇంటికి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు వారిని హామీల విషయమై మీ బాధ్యతగా నిలదీయాలి.ఇచ్చిన హామీలు నెరవేర్చని కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఏ ఎన్నికల్లో నైనా బుద్ధి చెప్పకపోతే ఈ మూడేళ్లు ఒక్క హామీ కూడా నెరవేర్చరు. ఓటుతో మనం గుణపాఠం చెప్తేనే ఈ మూడేళ్లలో ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తారు టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజల కోసం పని చేస్తుంది. ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వంపై పోరాటం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చే వరకు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటుంది

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments