
పయనించే సూర్యుడు న్యూస్ మార్చ్ నిజామాబాద్ జిల్లా బ్యూరో టి కే గంగాధర్
తెలంగాణ నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో భీంగల్ పట్టణంలో పలు బేకరీలను కమీషనర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. బేకరీ వారికి జరిమానా విధించారు. బేకరీ వారు నాణ్యమైన వస్తువులను ప్రజలకు విక్రయించాలన్నారు. షాప్ లోని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. చిన్న పిల్లలు తినే బేకరీ ఐటమ్స్ ను కల్తీ లేకుండా నాణ్యమైనంగా విక్రయించాలన్నారు. కాలం చెల్లిన వస్తువులను విక్రయించరాదన్నారు. 2019 మున్సిపల్ చట్టం జరిమానా విధించి చర్యలు తీసుకుంటామన్నారు. ఈ తనిఖీల్లో మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు