
పయనించే సూర్యుడు నిజాంబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్ తెలంగాణ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో భీంగల్ మండల కేంద్రంలో
నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు శ్రీ ధర్మపురి అరవింద్ మరియు బాల్కొండ ఇన్చార్జ్ డాక్టర్ ఏలేటి మల్లికార్జున్ రెడ్డి సోమవారం రోజు భీంగల్ పట్టణ కేంద్రంలో గల అకాల వర్షాలకు ముంపు గురైన వ్యవసాయ క్షేత్రాలను అలాగే ధ్వంసం అయిన రోడ్లను పరిశీలించి నష్టపోయిన రైతుల తో మాట్లాడి వారికి న్యాయం జరిగే విధంగా ప్రభుత్వాన్ని ప్రతి ఒక్క నష్టపోయిన రైతుకు ఎకరాల 50 వేల చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేయడం జరిగింది . ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు కనికరం మధు మండల అధ్యక్షులు ఆరె రవీందర్ కన్వీనర్ మల్కాన్న మోహన్ రెడ్డి జిల్లా జనరల్ సెక్రెటరీ నిమ్మల శీను ములిగె మైపాల్, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ యోగేశ్వర నరసయ్య జిల్లా ఓబీసీ ఉపాధ్యక్షులు లక్ష్మణ్ గౌడ్ , నవీన్ హరిప్రసాద్, పతాని ప్రవీణ్, గోపు అంజి మరియు ఇతర నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది
