
పయనించే సూర్యుడు: ఏప్రిల్ 13: ములుగు జిల్లా వాజేడు మండల ప్రతినిధి.రామ్మూర్తి.ఎ.
వాజేడు: ములుగు జిల్లా వాజేడు మండలంలోని
పేరూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఛత్తీస్గఢ్ సరిహద్దు ,మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలోని లొట్టా పెట్టెల గండి తెలంగాణ సరిహద్దులో బీర మయ్య జాతర (భీష్మ శంకరుడు) లో ములుగు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఆదేశాల మేరకు DR రాహిల్ సూచన మేరకు ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించడం జరిగినది. ఈ జాతర సమయంలో ప్రజలకు ఎటువంటి ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలుగా అలాగే వాడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన తెలియజేస్తూ ఆరోగ్య సమస్య లు ఉన్న ప్రజలకు చికిత్స చేస్తూ ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించడం జరిగినది.ఈయొక్క
ఉచిత ఆరోగ్య శిబిరం కార్యక్రమానికి ఆరోగ్య కార్యకర్తలు D శ్రీను,D జయంత్ లాల్ ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
