సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాస్తా మంత్రి పొన్నం ప్రభాకర్
పయనించే సూర్యుడు : జనవరి 11( హుస్నాబాద్ నియోజవర్గం ప్రతినిధి)గౌరవెల్లి ప్రాజెక్టు ముంపు బాధితులు గుడాటిపల్లి భూనిర్వాసితులపై ఉన్న కేసులను ఎత్తివేయాలని ముఖ్యమంత్రికి మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లోని భూ నిర్వాసితుల కాలనీలో పలు అభివృద్ధి పనులకు మంత్రి పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన చేసి మాట్లాడారు. గౌరవెల్లి ప్రాజెక్టు, మీడ్ మానేరు, మల్లన్న సాగర్ ఇతర ప్రాజెక్టుల భూ నిర్వాసితులపై ఉన్న కేసులను ఎత్తివేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్ననన్నారు. ఈ విషయమై నేడు ఇదే వేదిక నుండి ముఖ్యమంత్రికి లేఖ రాస్తున్నట్లు పేర్కొన్నారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వ నిరంకుశ విధానాలతో భూ నిర్వాసితుల పక్షాన పోరాడిన తనపై, ముఖ్యమంత్రి రేవంత్ పై కూడా కేసులు అయ్యాయని గుర్తు చేశారు. పెద్ద మనసుతో భూనిర్వాసితులపై, తమపై ఉన్న కేసులను ఎత్తివేసేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి, హుస్నాబాద్ మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత వెంకన్న, సింగిల్ విండో చైర్మన్ శివయ్య, కౌన్సిలర్, ముఖ్య నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు