
పయనించే సూర్యుడు ఏప్రిల్ 14 తెలంగాణ స్టేట్ ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి
భూభారతి రెవెన్యూ కొత్త చట్టాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తున్నది. శిల్పారామంలో అధికారు లు, మేధావుల మధ్య రేపు ప్రారంభించడానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నది. అయితే కొత్త చట్టంపై అన్నదాతలకు అవగాహన కలిగేలా రైతుల మధ్యే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తేనే బాగుంటుందనే అభిప్రా యం వ్యక్తమవుతున్నది. దీని ద్వారా కొత్తచట్టంపై విస్తృత ప్రచారం కలిగి అన్నదాతలతోపాటు ప్రభు త్వానికీ మేలు జరుగు తుందని గుర్తించాల్సిన అవసరముంది. ధరణిని తీసుకువచ్చిన ప్పుడు గత బీఆర్ఎస్ ప్రభుత్వం మూడుచింతల పల్లిలో రైతుల మధ్య గొప్పగా ఆవిష్కరించింది. చట్టం అమల్లోకి రాగానే గులాబీ కార్యకర్తలు ఊరూరా ఎండ్లబండ్లతో ర్యాలీలు తీశారు. అయితే ఇప్పుడు అన్నదాతల సమస్యలను పరిష్కరించేలా ఏడాదిన్నర కష్టపడి ప్రజామోదంతో తీసుకువస్తున్న ఆర్వోఆర్ 2025 లాంచ్ ప్రోగ్రామ్ ను సాదాసీదాగా నిర్వహిం చాలని ప్రభుత్వం నిర్ణయించడం రైతాంగానికి నిరాశకు గురి చేస్తున్నది. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ప్రధానాంశాల్లో ధరణి పోర్టల్ వైఫల్యం ఒకటి. అందుకే తమ భూములు ఎక్కడికీ పోవని ధైర్యం, నమ్మకం కల్పించేలా భూభారతి అమలుకు శ్రీకారం చుట్టాలని ధరణి బాధితులు కోరుతున్నారు. సన్నబియ్యం పంపిణీలో తప్పా.ఇతర సంక్షేమ పథకాలపై విస్తృత ప్రచారం కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. రాజ్యాం గం ప్రకారం అప్పీల్ వ్యవస్థ ఉండేలా తీసుకువస్తున్న భూభారతిపై ప్రచారంలో సైతం వెనకబడి ఉన్నామని కార్యకర్తలే విమర్శిస్తున్నా రు. ధరణికి, భూ భారతికి మధ్య తేడాలు ఏమేం ఉంటాయో కూడా జనానికి చేర్చకపోతే.. రానున్న స్థానిక ఎన్నికల్లో ప్రతిప క్షాలదే పైచేయి అవు తుందని చెబుతున్నారు. మళ్లీ పట్వారీలు వచ్చేశా రంటూ బీఆర్ఎస్ చేసే ప్రచారానికి కౌంటర్ ఇవ్వలేకపోతే.. ఎందుకు గ్రామ రెవెన్యూ వ్యవస్థ ఎంత అవసరమో? అర్థమయ్యేలా చేయకపోతే కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందులు తలెత్తుతాయన్న ఆందోళనను సీఎం రేవంత్ రెడ్డి గుర్తించాలని, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు రైతులు అనుకుంటున్నారు.