
మక్తల్ పట్టణ అంబేద్కర్ చౌరస్తాలో నిరసన పుంజనుర్ ఆంజనేయులు భూ నిర్వాసితుల సంఘం జిల్లా నాయకులు
సి ఆర్ గోవిందరాజ్ సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి
//పయనించే సూర్యుడు// ఆగస్టు 30// మక్తల్
మక్తల్ నారాయణపేట కోడంగల్ ఎత్తిపోతల పథకం భూ నిర్వాసితులకు న్యాయమైన పరిహారం ఇవ్వాలని గత 44 రోజులకు పైగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న సమస్యలను పరిష్కరించకుండా నేడు ప్రభుత్వం అక్రమ అరెస్టులకు పాల్పడడం హేయమైనా చర్య అని భూనిర్వాసితుల సంఘం జిల్లా నాయకులు పుంజనూర్ ఆంజనేయులు. సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి గోవింద్ రాజ్ విమర్శించారు ఈరోజు శుక్రవారం రోజు తెల్లవారుజామునే పోలీసుల చేత ప్రభుత్వం అరెస్టులకు పాల్పడడం దారుణం అన్నారు అరెస్టు చేసి ధన్వాడ పోలీస్ స్టేషన్కు తరలించడం ఏమిటని ప్రశ్నించారు. ప్రాజెక్టులో భూములు కోల్పోతున్న భూ నిర్వాసితులకు న్యాయమైన పరిహారం అందివ్వడంలో ప్రభుత్వం ముందుకు రావాలన్నారు.అరెస్టు చేసి నిర్బంధించి ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తే అది మరింత ఉవ్వెత్తున లేస్తదని హెచ్చరించారు.నారాయణపేట దామరగిద్ద భూనిర్వాసితుల నేతలను అరెస్టు చేసి ధన్వాడ పోలీస్ స్టేషన్ కి తరలించడం ఏమిటని ప్రశ్నించారు.
అరెస్ట్ అయిన వారిలో భూ నిర్వాసిత నేతలు జిల్లా గౌరవ అధ్యక్షులు జి వెంకట్రామిరెడ్డి గోపాల్ బలరా మహేష్ కుమార్ గౌడ్ ఆంజనేయ గౌడ్ జోషి రామకృష్ణ తదితరులు ఉన్నారు వెంటనే బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో భూ నిర్వాసితుల జిల్లా కార్యదర్శి కేశవులు శ్రీనివాస్ గౌడ్,, రాఘవేందర్ రెడ్డి, తిమ్మారెడ్డి, ఉషన్ గౌడ్, కృష్ణ, రఘు, జిలాని, శ్రీనివాసులు, పూజారి సోమన్న, గొల్ల బాలయ్య, గజలప్ప తదితరులు పాల్గొన్నారు.
