
పయనించే సూర్యుడు// న్యూస్ 24//మక్తల్
నారాయణపేట జిల్లా మక్తల్ మండలం కాట్రేవ్ పల్లి గ్రామ శివారులో నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకం కోసం భూసేకరణ సర్వే నిర్వహిస్తున్న రెవెన్యూ అధికారులను గ్రామస్తులు అడ్డుకున్నారు.ప్రభుత్వం నుండి ఎలాంటి ధీమా లేదని, స్పష్టమైన హామీ వచ్చేవరకు మా భూముల్లో సర్వే నిర్వహించడానికి ఒప్పుకోమని తేల్చి చెప్పారు. మా భూములు మాకు ఇవ్వండి మా భూముల్లో నుండి ఎలాంటి పైప్ లైన్ తీసుకుపోవాల్సిన అవసరం లేదంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అధికారులు వెనుదిరిగారు.
