Thursday, March 6, 2025
Homeఆంధ్రప్రదేశ్భూ సర్వే బలవంతంగాచేసిరైతులను ఇబ్బందులు పెట్టొద్దుప్రభుత్వం రైతులకు భరోసా కల్పించాలిరైతులకు అన్యాయం చేస్తే బిఆర్ఎస్ పోరాటంచేస్తుంది...

భూ సర్వే బలవంతంగాచేసిరైతులను ఇబ్బందులు పెట్టొద్దుప్రభుత్వం రైతులకు భరోసా కల్పించాలిరైతులకు అన్యాయం చేస్తే బిఆర్ఎస్ పోరాటంచేస్తుంది బిఆర్ఎస్ పార్టీ నాయకుల స్పష్టం

Listen to this article

//పయనించే సూర్యుడు// న్యూస్//ఫిబ్రవరి18//మక్తల్ రిపోర్టర్ సి తిమ్మప్ప// నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భాగంగా ప్రభుత్వ అధికారులు భూ సర్వే బలవంతం చేసి రైతులను ఇబ్బందులు పెట్టి రైతులకు అన్యాయం చేస్తే వారికి తరపున తమ పార్టీ పోరాటం చేస్తుందని మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పి నరసింహ గౌడ్ మండల అధ్యక్షుడు మండల పార్టీ అధ్యక్షుడు ఏ మహిపాల్ రెడ్డి పట్టణ అధ్యక్షుడు జుట్ల చిన్న హనుమంతులు స్పష్టం చేశారు మంగళవారము మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి నివాసంలో వారు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రైతులకు ముందు సమాచారం లేకుండా వారి పొలాల్లో సర్వే చేయడం వలన రైతులు ఆందోళన చెందుతున్నారని చెప్పారు అధికారులు సర్వే చేసే ముందు రైతులకు అవగాహన కల్పించి వారికి నోటీసులు ఇచ్చి సర్వే చేయాలని వారు డిమాండ్ చేశారు మండలంలోని కాట్రుపల్లి ఎర్నాంగనపల్లి టేకులపల్లి కాచువార్ గ్రామాలకు చెందిన వందలాదిమంది రైతులు గత ఎన్నో సంవత్సరాలుగా సాగు చేసుకున్న తమ విలువైన భూములు పోయాయని ఆందోళనలో ఉన్నారని వారికి అవగాహన కల్పించాల్సిన అవసరం ప్రభుత్వంపై ఎంతైనా ఉందని వారు తెలిపారు ఎన్నో సంవత్సరాలుగా ఆ భూములపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్న రైతులకు భరోసా కల్పించాల్సిన ఈ ప్రభుత్వ అధికారులు పోలీసులను కాపలాగా పెట్టుకొని భూ సర్వే చేయడం ఎంతవరకు సమంజసం అని వారు ప్రశ్నించారు అదేవిధంగా రైతులకు ఏ జీవో ప్రకారం గా ఎంత నష్టపరిహారం ఎకరానికి ఇస్తున్నారని విషయాన్ని ముందే అధికారులు రైతులకు చెప్పాల్సిన అవసరం ఉందని వారు కోరారు చిన్న గోపులాపూర్ దగ్గర ఉన్న పంప్ హౌస్ సామర్థ్యాన్ని పెంచి నారాయణపేట కొడంగలు ప్రాజెక్టుకు నీళ్లు తరలించాల్సిన అవసరం ఉండగా అలాంటి చర్యలు ఈ ప్రభుత్వం చేపట్టడం లేదని అనుమానాలను వారు వ్యక్తం చేశారు నిజంగా ఈ ప్రభుత్వానికి ప్రాజెక్టులపై చిత్తశుద్ధి ఉంటే ప్రస్తుతం ఉన్నటువంటి పంప్ హౌస్ మోటార్లను మరియు కాలువల నిర్మాణాన్ని సామర్ధ్యాన్ని సామర్థ్యం పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు తెలిపారు ఈ పంప్ హౌస్ లో ఉన్న మోటార్ల సామర్థ్యాన్ని కాలువల సామర్ధ్యాన్ని విస్తరించకపోతే ఎన్నో సంవత్సరాల కెళ్ళి నీళ్లు తీసుకుని సాగు చేసుకుంటున్నటువంటి సంగమండ బూత్పూరు రిజర్వాయర్ కింద ఉన్న రైతులకు నష్టం జరిగే ప్రమాదంఉన్నాయని వారు తెలిపారు అంతేకాకుండా మక్తల్ నియోజకవర్గం పరిధి వరకు ఓపెన్ కెనాల్ ద్వారా నీళ్లను తీసుకువెళ్లినట్లయితే ఈ ప్రాంత రైతులకు కొంత మేలు జరుగుతుందని వారు తెలిపారు గ్రావిటీ కెనాల్ ద్వారా తీసుకువెళ్తే బిఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తుందని రైతుల పక్షాన నిలబడుతుంది అని వారు తెలియజేశారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం భూ సర్వే బలవంతం చేయకుండా పై విషయాలపైన పునరాలోచన చేసి ఈ ప్రాంత రైతులకు నష్టం జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందని చెప్పారు ఒకవేళ తమ వైఖరిని మార్చుకోకపోతే రైతుల పక్షాన బిఆర్ఎస్ పార్టీ వారికి సంపూర్ణ మద్దతు తెలిపి ఈ వారికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని వారు స్పష్టం చేశారు విలేకరుల సమావేశంలో కాట్రపల్లి ఎర్నాంపల్లి టేకులపల్లి కాచి వారు మంతనుకోడు గ్రామాలకు చెందిన రైతులు రామకృష్ణారెడ్డి సుదర్శన్ గౌడ్ విష్ణువర్ధన్ రెడ్డి అశోక్ రెడ్డి, శ్రావణ్ కుమారు నరసింహులు కురువ మల్లేష్ మక్తల్ మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు అన్వర్ హుస్సేను మొగిలప్ప జగ్గాలి రాములు టిఆర్ఎస్ పార్టీ నాయకులు చందాపురం అశోక్ కుమార్ గౌడ్ రఘు జుట్ల సాగర్ తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments