పయనించే సూర్యుడు న్యూస్(అక్టోబర్.25/10/2025) తిరుపతి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
తిరుపతి జిల్లా సత్యవేడు మండలంలో అక్టోబర్ 27వ తేదీన ప్రత్యేక ఆధార్ క్యాంపులను నిర్వహిస్తున్నట్టు స్థానిక మండల పరిషత్ పరిపాలన అధికారి త్రివిక్రమ రావు పేర్కొన్నారు.ఇందులో భాగంగానే విద్యార్థుల సౌకర్యార్థం సత్యవేడు పట్టణం ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల,మదనంబేడు జడ్పీ ఉన్నత పాఠశాలలో ప్రత్యేక ఆధార్ క్యాంపు సోమవారం జరుగుతుందన్నారు.ఆయా పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులు ఆధార్ కార్డు లేని వారు కొత్తగా నమోదు చేసుకోవచ్చన్నారు.దీంతోపాటు ఆధారు చిరునామా,పేరుమార్పు,తప్పొప్పులను సరిచేసుకునే అవకాశం ఉందన్నారు.పైగా ఆధార్ నమోదు,తప్పొప్పులను సరి చేసుకోవడంలో విద్యార్థులు ఎటువంటి రుసుము చెల్లించకుండా ఉచితంగా చేసుకోవచ్చనన్నారు. అక్టోబర్ 27 ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఆధార్ క్యాంపు కొనసాగుతుందన్నారు.ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.జిల్లా అధికారుల ఆదేశాల మేరకు ప్రత్యేక ఆధార్ క్యాంపులను నిర్వహిస్తున్నామన్నారు.

