
- అధికారుల కనుసన్నల్లో నడుస్తున్న మైనింగ్ మాఫియా
గ్రామసభ ఆమోదం లేకుండానే ఏజెన్సీ సంపద లూటి
ఉన్నతాధికారుల స్పందించకపోతే ప్రజా పోరాటం
సిపిఎం
పయనించే సూర్యుడు జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్
చింతూరు, ఏప్రిల్- 11: చింతూరు మండలంలో మైనింగ్ మాఫియా విచ్చలవిడిగా అక్రమాలకు పాల్పడుతుందని, ఏజెన్సీలో ఉన్న లక్షల రూపాయలు విలువ చేసె సంపదను కొల్లగొడుతున్నారని, అధికారులకు తెలిసిన అక్రమ మైనింగ్ పై చర్యలు తీసుకోకుండా నిమ్మకు నీరు ఎత్తినట్లు వ్యవహరిస్తున్నారని తక్షణమే మైనింగ్ మాఫియా పై చర్యలు తీసుకోకపోతే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజా పోరాటం నిర్వహిస్తామని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పల్లపు వెంకట్, జిల్లా కమిటీ సభ్యులు సిసం సురేష్ తెలిపారు. శుక్రవారం నాడు సిపిఎం పార్టీ ఆఫీసులో పల్లపు వెంకట్, సీసం సురేష్ మాట్లాడుతూ ఏజెన్సీలో గ్రామాల్లో మౌలిక సౌకర్యాలు లేక ప్రజలందరూ అనేక తీవ్ర అవస్థలు పడుతున్నారని, మంచినీరు, రోడ్లు, విద్యుత్తు తదితర మౌలిక సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వాలు వెనుక పడుతున్నాయని అన్నారు. కానీ ఏజెన్సీ లో ఉన్న లక్షల విలువ చేసే సంపదను మాత్రం ఏ రకంగా అయినా దోచుకు వెళ్లాలని ప్రభుత్వాలు మారినప్పుడల్లా ప్రభుత్వంలోని పెద్దల అండతో మైనింగ్ మాఫియా విజృంభిస్తుందని తెలిపారు. ఏజెన్సీలో గ్రామసభలు పీసా కమిటీలు ఉన్నప్పటికీ గ్రామ సభల ఆమోదం లేకుండానే గ్రామాల్లో ఉన్న తెల్ల రాయిని తరలిస్తున్నారని అన్నారు. మండలంలో గూడూరు, నర్సింగపేట గ్రామాల్లో తెల్లరాయి తరలింపు జరుగుతుందని తెలిపారు. మైనింగ్ అనుమతులు లేకుండా, గ్రామ సభల తీర్మానాలు లేకుండా తెల్ల రాయి తరలించడానికి అధికారులు ఎలా అనుమతులు ఇస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు. ఇప్పటికైనా ఉన్నతాధికారుల జోక్యం చేసుకొని మైనింగ్ మాఫియాను కట్టడి చేయాలని, ఏజెన్సీలో లక్షలు విలువ చేసే సంపదను ఆదివాసి గ్రామాల అభివృద్ధి కొరకు ఉపయోగించాలని, పెసా గ్రామ సభలకు ప్రాధాన్యత ఇవ్వాలని, గిరిజన నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి చూపించాలని, అక్రమ మైనింగ్ పాల్పడుతున్న వారి పైన క్రిమినల్ కేసులు బుక్ చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రజా పోరాటం తప్పదని హెచ్చరించారు.సమావేశంలో లో చింత రాంబాబు పాల్గొన్నారు

