
పయనించే సూర్యుడు న్యూస్( 25 08 2025 ) ప్రతినిధి అంజి పెద్దేముల్ మండల కేంద్రం లోని mro ఆఫీస్ ముందు బీజేపీ నాయకులు రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు స్థానిక సమస్యలపై బీజేపీ మండల అధ్యక్షులు వీరేశం ఆధ్వర్యంలో ( ఎం ఆర్ ఓ ) కు మెమోరాండం ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యూ రమేష్ కుమార్ గారు మాట్లడుతూ మండలం లోని వివిధ గ్రామాల నుండి మండల కేంద్రానికి వివిధ పనుల కోసం మరియు వైద్యం కొరకు వస్తున్నా ప్రజలకూ రోడ్లు సరిగ్గా లేక అనేక ఇబ్బందుల ఫాలు అవుతున్నారని అన్నారు. అదేవిదంగా ఈ మండల పరిధిలోని అక్రమంగా మైనింగ్ లపై ప్రభుత్వం వెంటనే అరికట్టాలని వారు డిమాండ్ చేసారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలనీ వారు డిమాండ్ చేసారు. అధిక వర్షాలతో నష్టపోయిన రైతులను గ్రామాలలో పరిశీలించి వాళ్లని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు అదేవిధంగా ఈ యొక్క స్థానిక సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున బీజేపీ పార్టీ తరపున ఉద్యమిస్తామని వారు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి బంటారం భద్రశ్వర్, జిల్లా కార్యవర్గ సభ్యులు సందీప్ కుమార్, హరీష్ గౌడ్, మండల ప్రధాన కార్యదర్శులు శివరాజ్, వెంకట్ రాంరెడ్డి,నాయకులు నర్సింహా బుమే, రాంచేంద్రీ, యాదయ్య గౌడ్, శేఖర్, కృష్ణ అనంతప్ప, నరేందర్, శివ,రాజు, కృష్ణ, వరప్రసాద్ దత్తు తదితరులు పాల్గొన్నారు.