భారత సైనికులకు సత్కారం.
పలు కార్యాలయాల్లో జాతీయ జెండా ఆవిష్కరణ.
పయనించే సూర్యుడు, జనవరి 26 ,బూర్గంపాడు మండల రిపోర్టర్ పోతుగంటి రామ్ ప్రసాద్:- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండల కేంద్రంలో పలు ప్రభుత్వ కార్యాలయాల్లో,పాఠశాలల్లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిపారు. 76 వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జరిగిన ఈ వేడుకల్లో మండల తహశీల్దార్ కార్యాలయంలో తహసిల్దార్ ముజాహిద్ చేతుల మీదుగా జండా ఆవిష్కరణ జరగగా, ఎంపిడిఓ కార్యాలయంలో ఎంపిడిఓ జమలా రెడ్డి చేతుల మీదుగా జండా ఆవిష్కరణ జరిగింది. న్యూ సెంచరి హై స్కూల్ లో స్కూల్ చైర్మెన్ ఆసిక్ ఆధ్వర్యంలో మొదటి సారి జవాన్ షాకిర్ చేతుల మీదుగా జండా ఆవిష్కరించారు, సరికొత్త ఉత్తేజం, న్యూ సెంచరీ విద్యార్థులతో కలిసి ర్యాలీలో పాల్గొని పలు జండా ఆవిష్కరణ కార్యక్రమాల్లో జవాన్ షాకీర్ పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో సెక్రటరీ బర్ల ప్రభాకర్ చేతుల మీదుగా జండా ఆవిష్కరించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో సూపర్డెంట్ డా” ముక్కేంటేశ్వరరావు చేతుల మీదుగా జండా ఆవిష్కరణ జరిగింది. ఆటో అడ్డా వద్ద ఆటో యునియన్ సభ్యులతో కలిసి, మండల అధికారుల చేతుల మీదుగా జండా ఆవిష్కరణ జరిగింది. ఈ వేడుకల్లో భాగంగా న్యూ సెంచరీ హై స్కూల్ విద్యార్థులు దేశ నాయకుల వేష ధారణలో పాల్గొన్నారు. పలు కార్యాలయాల్లో, పాఠశాలల్లో, పలు చోట్ల ఈ జండా ఆవిష్కరణ కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తహసిల్దార్ ముజాహిద్ మాట్లాడుతూ భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి నేటితో 76 ఏళ్లు అవుతున్న సందర్భంగా దేశ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మనం ఇంత ప్రశాంతంగా ఇలా ఉంటున్నాం అంటే ఆ నాడు దేశ నాయకుల పోరాటం అయితే.. ఈ నాడు దేశ సైనికులు అని గుర్తు చేస్తూ ఈ జండా ఆవిష్కరణ కర్యక్రమంలో పాల్గొన్న దేశ సైనికులు షాకీర్, ప్రశాంత్ (పండు) లను గ్రామ పెద్దలతో కలిసి శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమాల్లో తహసిల్దార్ ముజాహిద్, ఎంపిడిఓ జామలా రెడ్డి, డిప్యూటీ తాసిల్దార్ రామ్ నరేష్ వారి సిబ్బంది, దేశ సైనికులు షాకీర్, ప్రశాంత్ (పండు) అదేవిధంగా గ్రామ పెద్దలు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, బూర్గంపహాడ్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళ నాయకులు, పలు పార్టీల నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.