
ఎమ్ ఈ ఓ సుధాకర్ ఆధ్వర్యంలో ఘన సన్మానం
పయనించే సూర్యుడు సెప్టెంబర్ 6,మహబూబ్ నగర్ జిల్లా
రాజాపూర్ మండలం రిపోర్టర్ నరిగె కళాశేఖర్ రాజాపూర్ మండలం ఉత్తమ ఉపాధ్యాయురాలిగా రాయపల్లి గ్రామ ప్రాధమిక పాఠశాల ఉపాధ్యాయురాలు విజయలక్ష్మి కి మండల విద్యాశాఖ అధికారి సుధాకర్ అవార్డు ప్రధానం చేస్తూ ఘనంగా సన్మానించారు. సెప్టెంబర్ 5 సర్వేపల్లి రాధాకృష్ణ ఉపాధ్యాయ దినోత్సవం సందర్బంగా మండల స్థాయిలో ఎంపికయ్యిన ఉత్తమ ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులకు సన్మానం చేసారు.ఎం ఈ ఓ మాట్లాడుతూ గురువులు పిల్లల భవిష్యత్తకు పునాదులు వేసి దిశా నిర్దేశం చేసి బంగారు భవిష్యత్ అందించే ప్రయత్నం లో గురువుల పాత్ర మరవలేనిది అన్నారు. రాయపల్లి గ్రామ ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న విజయలక్ష్మి ఎంపిక కావడం తో రాయపల్లి గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేసారు.ఈ కార్యక్రమం లో మండల విద్యాధికారి ఎ సుధాకర్,రంగారెడ్డి గూడ కాంప్లెక్స్ హెడ్మాస్టర్ శ్రీ వెంకటరామిరెడ్డి రాజాపూర్ కాంప్లెక్స్ హెడ్మాస్టర్ శ్రీ సయ్యద్ ఇబ్రహీం, రాయపల్లి హెడ్మాస్టర్ రంజిత్ కుమార్ మరియు అన్ని ఉపాధ్యాయ సంఘాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అవార్డు గ్రహీతలు పాల్గొన్నారు