విద్యుత్ శాఖ మండల అధికారి రమేష్ బాబు
పయనించే సూర్యుడు అక్టోబర్ 25 అన్నమయ్య జిల్లా టి సుండుపల్లి మండలం
మంతా తుఫాన్ ప్రభావం వాతావరణ శాఖ హెచ్చరికలను నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు పాటించాలని మండల విద్యుత్ శాఖ అధికారి రమేష్ బాబు మండల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచనలు చేశారు. ఈ సందర్భంగా వారు తెలియజేస్తూ మంతా తుఫాను ప్రభావం సుండుపల్లి మండల ప్రజల పైన అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.అందువలన తుఫాన్ ప్రభావంతో వర్షం అధికంగా పడే సమయంలో కరెంటు స్తంభాల దగ్గరికి వెళ్లకుండా ఉండాలని అలాగే రైతులు పొలాలలో ఉన్న స్టాటర్లను తాకరాదని వైర్లు వంటి కరెంటు సంబంధిత వాటిని చేతితో తగలకుండా దూరంగా ఉండాలని అలాగే మంత తుఫాన్ ప్రభావంతో కరెంటు స్తంభాలు విరిగిన, వైర్లు తెగిపడిన సుండుపల్లి విద్యుత్ శాఖ అధికారులకు వెంటనే తెలియజేసి అత్యవసర సహాయం పొందాలని ఈ కింద కనపరిచిన ఫోన్ నెంబర్లకు ఏ సమయంలో అయినా ఫోన్ చేసి సమస్య ఉంటే తెలియజేయడం గాని లేకపోతే సహాయం పొందాలన్న ఈ నెంబర్లు కు సుండుపల్లి సబ్స్టేషన్ 9490615966, మడతాడు సబ్స్టేషన్ 8332974034, రాయవరం సబ్స్టేషన్ 9490645241, ముడుంపాడు సబ్స్టేషన్ 8332974035, రెడ్డివారి పల్లి సబ్స్టేషన్ 9491044658, పూజారి వాండ్ల పల్లి సబ్స్టేషన్9490156520, సానిపాయి సబ్స్టేషన్ 8985911510, రాచ వాండ్ల పల్లి సబ్స్టేషన్ 90308882677 పై గల ఫోన్ నెంబర్లకు ప్రజలు ఫోన్ చేయాలని తెలిపారు.

