
పయనించే సూర్యుడు :జూన్ 17: మక్తల్ రిపోర్టర్ సి తిమ్మప్ప:
మహబూబ్ నగర్: నేడు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో పర్యటనకు విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక, డైరీ డెవలప్మెంట్, క్రీడలు, యువజన మరియు మత్స్య శాఖ మంత్రివర్యులు డా. వాకిటి శ్రీహరి ని ఘనంగా స్వాగతం పలికిన ఉమ్మడి పాలమూరు జిల్లా ముఖ్యనాయకులు, కార్యకర్తలు. ఈ సందర్భంగా వారు పండుగ సాయన్న విగ్రహానికి, అమరవీరుల స్థూపానికి మరియు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు యెన్నం శ్రీనివాస్ రెడ్డి , దేవరకద్ర నియోజకవర్గ శాసనసభ్యులు జి మధుసూదన్ రెడ్డి , పలు విభాగాల చైర్మన్ లు మరియు ముఖ్య నాయకులు.
