పయనించే సూర్యుడు ( న్యూస్) జనవరి12 మక్తల్ ( రిపోర్టర్ సి తిమ్మప్ప ) మక్తల్ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్వామి వివేకానంద చిత్ర పటానికి పూలమాల వేసి జయంతి శుభాకాంక్షలు తెలిపిన మక్తల్ నియోజకవర్గ శాసన సభ్యులు డా”వాకిటి శ్రీహరి గ…అనంతరం గౌరవ ఎమ్మెల్యే మాట్లాడుతూయువతకు స్ఫూర్తి ప్రధాత,తన అపార మేధస్సుతో దేశ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన మహోన్నత వ్యక్తి స్వామి వివేకానంద అని, ప్రపంచ యువశక్తిని జాగృతపరుస్తూ శ్రీ వివేకానంద నవ భారత నిర్మాణం కోసం ఎంతగానో తపించారని స్మరించుకున్నారు. ఆత్మవిశ్వాసం విజయ తీరాలవైపు నడిపిస్తుందని, జీవితంలో నిస్పృహ చెందకుండా గమ్యం చేరడంలో విశ్రమించవద్దని వివేకానంద గారి బోధనలు ప్రతి తరానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయని అన్నారు
ఇట్టి కార్యక్రమంలో నియోజకవర్గంలో లోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ,అభిమానులు, తదితరులు పాల్గొన్నారు