
పయనించే సూర్యుడు జనవరి 21 ( ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి)… చేజర్ల మండలం మడపల్లి గ్రామంలో మంగళవారం పశు వైద్యాధికారి డాక్టర్ రాజేష్ ఆధ్వర్యంలో ఉచిత పశు ఆరోగ్య శిబిరం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో దూడలకు . పెద్ద పశువులకు నట్టల నివారణ మందులు, పశువులలో గర్భకోశ వ్యాధులకు చికిత్స అందించబడినది. ఈ కార్యక్రమంలో చేజర్ల పశువైద్యాధికారి డా.రాజేష్, పశు వైద్య సహాయకులు శ్రీకాంత్, మల్లికార్జున, ఏ హెచ్ ఏ శ్రీహరి, గోపాలమిత్ర సునీల్ మడపల్లి పాడి రైతులు తదితరులు పాల్గొన్నారు.