
ఏప్రిల్ 14 నుండి 21 వరకు సేవా యాత్ర
ఏప్రిల్ 22, మంగళవారం పోతనపల్లిలో ప్రధాన పండుగ
పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ ఏప్రిల్ 12
అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు పోతనపల్లి రక్త సంబందికుల మానవ సంబంధల ఆధారంగా జాతి నిర్వచన – సామజిక నిర్మాణ వైభవానికి ప్రతీక ఐన భారత దేశ చారిత్రక గోండ్వాన రాజ్య మూలవాసి ఐన కోయ జాతి, నాగ వంశ, పారేడు (7 వ) గట్ట గోత్రం, మడివి కుటుంబ ఆనాల్ పేన్ (ఇళవేలుపు) ” అందల్ కోస ” పెద పండుగ – ఈ నెల 13 న ఆదివారం చింతూరు మండలం పోతనపల్లి గ్రామంలో గణంగా జరుగుతుందని, తరతరాలుగా కొలుస్తున్న వెళ్పుల ప్రతీకలైన జెండాలు, జెండా కర్రలు స్తావరాల నుండి అగమనంతో పేన్ పండుగ ప్రారంభం ఔతుందని ఏప్రిల్ 22, మంగళవారం అసలు పండుగ, మొక్కుల చెల్లింపులు, మడివి వారి బంతి ఉంటాయని ఈ పండుగలో మడివి కుటుంబాలతోపాటు మేన వారు, ఆడపడుచులు, వియ్యాల వారు, కోయ వారసులు బందు మిత్రులు, శ్రేయోభిలాషులు భక్తి శ్రద్దలతో హాజరై విజయవంతం చేయాలని పండుగ నిర్వాహక బాద్యులు మడివి నెహ్రూ పిలుపునిచ్చారు. ఇది మడివి కుటుంబ పండుగ మాత్రమే కాదని కోయ జాతి వారసత్వ ప్రతీక అని, ఇది పూర్వికులకు వరుసలు చేసే సంస్మరణ పండుగ అని స్పష్టం చేశారు. ఈ పండుగలో ఏప్రిల్ 14 నుండి 21 వరకు 8 రోజుల పాటు ఆంధ్ర, ఒడిషా రాష్ట్రాలలో మడివి వారసులు ఉన్న వివిధ గ్రామాలలో ఉన్న వేల్పుల గద్దెలు సందర్శిస్తూ, మడివి కుటుంబాల గృహ శాంతి సేవా సందర్శనలతో పాటు తప్పార్ తీరుస్తూ, సుంకు సేకరణతో సేవా యాత్ర సాగుతుందని తెలిపారు. ఈ సందర్బంగా పోతనపల్లి గ్రామ పెద్ద, గద్దె వడ్డె ఐన మడివి బాబురావు మాట్లాడుతూ ఈ సేవయాత్ర ఏప్రిల్ 14, ఆదివారం ఉదయం చింతూరు మండలంలోని పోతనపల్లి నుండి బయలుదేరి ఏప్రిల్ 16 వరకు బురదగూడెం, పెద సీతనపల్లి, గౌళ్ళకోట, మర్కగుండెం, లక్కవరం, గొడ్లగూడెం, గూడూరు, కొత్తపల్లి చేరుకొని, ఏప్రిల్ 17 న కొత్తపల్లి నుండి సీలేరు అవతలికి దాటి ఒడిషా రాష్ట్ర మల్కాన్గిరి జిల్లా కుయ్గొండ, బువ్వాల్, పెల్బైల్ మీదుగా ఏప్రిల్ 20 కి తోంకెల్ లో ఉన్న గద్దెలు చేరుకొని ఏప్రిల్ 21 న సోమవారం ఒడిషా మడివి కుటుంబాల మొక్కులు, పూజలు, సేవలు అందుకుంటుంది. సాయంత్రానికి ఒడిషా లోని ఉర్వేల్ గ్రామంలో బసచేసి ఏప్రిల్ 22, మంగళవారం ఉదయం మోటు మీదుగా ఆంధ్రలోకి ప్రవేశించి కుయ్గూరు వద్ద శబరి నదిలో పవిత్ర గంగ స్నానం ఆచరించిన ఆనాల్ పేన్ నేరుగా పోతనపల్లి ప్రధాన గద్దెలు చేరుకోవడంతో ప్రధాన పండుగ సంబరం మొదలౌతుంది. మధ్యాహ్నం నుండి రక్త సంబంధికుల, వారసుల, బందుపరివారం మొక్కులు, పూజలు, సేవలు ముగించుకుని పవిత్ర సుంక్ అందించి సాయంత్రానికి జాతర ముగుస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో మడివి సుబ్బారావు, మడివి రాజయ్య, మడివి శ్రీను, మడివి శంకర్, మడివి సాయి తదితరులు పాల్గొన్నారు.