
అదృశ్యమైన యువకుడు కర్రోల్ల విజయ్ కుమార్..
రుద్రూర్, ఏప్రిల్ 1 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) : రుద్రూర్ గ్రామానికి చెందిన కర్రోల్ల విజయ్ కుమార్ (33) అను వ్యక్తి అదృష్టమైనట్లు ఎస్సై సాయన్న తెలిపారు. ఎస్సై సాయన్న తెలిపిన వివరాల ప్రకారం.. కర్రోళ్ల విజయ్ కుమార్ కు భార్య గౌడి ప్రియాంకతో 6 సంవత్సరాల క్రితం పెళ్లి అయింది. ఒక బాబు ఉన్నారు. గత సంవత్సరంలో ఇల్లు కట్టడానికి అప్పులు ఎక్కువయ్యాయని, దాని గురించి ఆలోచిస్తూ విజయ్ కుమార్ మద్యానికి బానిసై మతిస్థిమితం సరిగ్గా ఉండేది లేదన్నారు. అప్పుడప్పుడు విజయ్ కుమార్ ఇంట్లో చెప్పకుండా వెళ్లి 2 నెలల వరకు ఇంటికి తిరిగి వచ్చేవాడు కాదని, మార్చ్ 11 వ తేదీన రోజు మాదిరిగానే మా బాబును స్కూల్ కు తీసుకొని వెళ్లానని, ఇంట్లో మా అత్తమ్మ, నా భర్త ఇద్దరు ఉన్నారు. తర్వాత ఉదయం ఎనిమిది గంటలకు నా భర్త ఇంట్లో ఏమి చెప్పకుండా ఇంటి నుండి బయలుదేరి ఇప్పటివరకు ఇంటికి తిరిగి రాకపోవడంతో, భార్య గౌడి ప్రియాంక మంగళవారం రుద్రూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ప్రియాంక ఫిర్యాదు మేరకు ఎస్ఐ సాయన్న కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నట్లు వెల్లడించారు.