పయనించే సూర్యుడు న్యూస్ అక్టోబర్ 25 తెలంగాణ స్టేట్ ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి
మీ ఇష్టం వచ్చినట్టు గడువు పెంచుతామంటే కుదరదు
కాంగ్రెస్ ప్రభుత్వంపై తెలంగాణ హైకోర్టు అసహనం
ఆశించిన స్థాయిలో మద్యం దుకాణాల టెండర్లకు దరఖాస్తులు రాకపోవడంతో, ఇటీవల దరఖాస్తులు దాఖలు చేసేందుకు గడువు పెంచిన తెలంగాణ ప్రభుత్వం గడువు పెంచడం చట్ట విరుద్ధమని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన పలువురు మద్యం వ్యాపారులు ఈ పిటిషన్ పట్ల విచారణ జరుపుతూ ప్రభుత్వంపై మండిపడ్డ హైకోర్టు న్యాయమూర్తి ఎన్.తుకారంజీ చట్టబద్ధత లేకుండా గడువు పెంచడం ఏంటని, ఇష్టానుసారంగా వ్యవహరించడం కుదరదని, చట్ట విరుద్ధంగా గడువు పెంచితే దరఖాస్తులు రద్దు చేయాల్సి ఉంటుందని ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు న్యాయమూర్తి ప్రభుత్వం తరపు న్యాయవాది విజ్ఞప్తి మేరకు విచారణ ఈరోజుకు (శనివారం) వాయిదా వేసిన తెలంగాణ హైకోర్టు మరో వైపు మద్యం దుకాణాల్లో దివ్యాంగులకు రిజర్వేషన్లు కల్పించకపోవడంపై దాఖలైన మరో పిటిషన్లో ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిన హైకోర్టు న్యాయమూర్తి

