మండల విద్యాధికారి ఎంఈఓ వినతిపత్రం అందజేత
( పయనించే సూర్యుడు అక్టోబర్ 30 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మధ్యాహ్న భోజన కార్మిక సంఘం సిఐటియు ఆధ్వర్యంలో ఈరోజు ఫరూక్నగర్ మండల ఎంఈఓ మనోహర్ కు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం డివిజన్ కన్వీనర్స్ శ్రీను నాయక్ మాట్లాడుతూ పెరిగిన ధరలకు అనుగుణంగా గుడ్ల ధరలను కట్టెల బిళ్ళను గ్యాస్ బిల్లులను పెంచాలని మరియు పెండింగ్ లో ఉన్న గత విద్యా సంవత్సరానికి మరియు ప్రస్తుతానికి మనిషిన పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని వారు అన్నారు అదేవిధంగా రాష్ట్రప్రభుత్వం మధ్యాహ్న భోజన కార్మికులకు కనీస వేతనం 18000 ఇవ్వాలని పిఎఫ్ ఈఎస్ఐ పెంచాలని తదితర సమస్యలు పరిష్కరించాలని వారు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన కార్మిక సంఘం నాయకురాలు చిట్టెమ్మ సుమలత కాజా బేగం యాదమ్మ రెహానా లలితమ్మ హసీనా సౌలీబి శివమ్మ అనిత తదితరులు పాల్గొన్నారు

