
గిరిజన ప్రాంతాలలో 100% ఉద్యోగాలు గిరిజనులకే కేటాయించాలి.
పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ మే 2
అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం మండలంలో నీ రాష్ట్ర మన్యం బందును ఉద్దేశించి మాట్లాడుతున్న గిరిజన సంఘం అధ్యక్షులు తెల్లం తమ్మయ్య. జీవో నెంబర్ మూడును పునర్ధరించి 100 శాతం ఉద్యోగాలు ఏజెన్సీ గిరిజనులకు కల్పించాలన్నారు. రాష్ట్రంలో ఏజెన్సీ గిరిజనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానం… గెలిచిన తర్వాత నిలబెట్టలేక పోవడం అంటే గిరిజనులను మోసం చేయడమే అని విమర్శించారు. ఆదివాసి యువతి యువకులను మోసం చేసిన టిడిపి కూటమి ప్రభుత్వం ఎద్దేవా చేశారు. ఏదైతే ఎన్నికల ముందు జీవో నెంబర్ మూడును సుప్రీంకోర్టులో రీ పిటిషన్ వేసి ఏజెన్సీ గిరిజనులు అందరికీ ఉద్యోగ భద్రత కల్పిస్తామన్న కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా జీవో నెంబర్ మూడును అమలకు కృషి చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కమిటీ నాయకులు పాయం సీతారామయ్య, గిరిజన సంఘం మండల కార్యదర్శి బాబు బొర్రయ్య, మండల కమిటీ సభ్యులు మాడం బాబు. సర్పంచ్ సోడే శంకర్ నిరుద్యోగ యువతీ యువకులు పాల్గొన్నారు.