Monday, January 27, 2025
Homeఆంధ్రప్రదేశ్మన్యపుత్ర యువజన సంఘం మరియు గుర్రాలగొంది గ్రామస్తులు

మన్యపుత్ర యువజన సంఘం మరియు గుర్రాలగొంది గ్రామస్తులు

Listen to this article

పయనించే సూర్యడు న్యూస్. గూడెం కొత్తవిధి మండలం జనవరి 20. రిపోర్టర్ 🙁 చల్లంగి వినోద్ )… మారుమూల గుర్రాలగొంది గ్రామానికి దత్తత తీసుకొని విద్య అభివృద్ధి కృషి చేస్తున్న ఉన్నతవిద్యావంతుడు పాటి రామరాజు (పిహెచ్.డి స్కాలర్) ఆయన కృషికి ఘన సన్మానించారు:- ఆయనకు,ఏకలవ్య ప్రవేశ పరీక్షలో ప్రతిభ కనబరిచిన విద్యార్దులను అభినందనలు. ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న పాటి రామరాజు(పిహెచ్డి స్కాలర్) మారుమూల గుర్రాలగొంది గ్రామానికి దత్తత తీసుకొని విద్యాభివృద్ధికి కృషి చేస్తున్న సేవలు నేటి యువతరానికి ఎంతో ఆదర్శం. అని మన్యపుత్ర యువజన సంఘం అధ్యక్షుడు సోమేష్ కుమార్(ఉప సర్పంచ్)అన్నారు.గూడెం కొత్తవీధి మండలం,రింతాడ పంచాయితీ,గుర్రాలగొంది మారుమూల గ్రామానికి ఆదివారం సాయంత్రం న సంఘ బృందంతో పాటు సందర్శించి ఆ గ్రామంలో చదువుతున్న విద్యార్థులు వివిధ ప్రవేశ పరీక్షల్లో ప్రతిభను రాణించేలా సెలవుల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ,వారి విద్యాభివృద్ధికి కృషి చేస్తున్న పాటి రామరాజు సేవలను గుర్తించి మన్యపుత్ర యువజన సంఘం ఆధ్వర్యంలో పెసా గ్రామ కమిటీ ఉపాధ్యక్షుడు మురళి,కార్యదర్శి రాజేష్ కుమార్,వార్డు మెంబర్ పాల్సు,గ్రామస్తులు మరియు సంఘ సభ్యులు కలిసి పిల్లల సమక్షంలో ఆయనను ఘనంగా సన్మానించారు. ఆయన కృషి వల్ల 2024 సంవత్సరంలో ఏకలవ్య ప్రవేశ పరీక్షలో ప్రతిభ కనబరిచి, ఏకలవ్య పాఠశాల 6 వ తరగతి చదువుతున్న అదే గ్రామానికి చెందిన ఐదుగురు విద్యార్థులను. ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జీవిత చరిత్ర పుస్తకం తో అభినందించారు.
అనంతరం సంఘ ఉపాధ్యక్షుడు నూకరాజు,సభ్యుడు అర్జున్ ఈ సందర్భంగా మాట్లాడుతూ చదువుతోనే అన్ని సాధ్యమన్నారు.అందుకు పిల్లలను చదివించడంలో ప్రోత్సహించాలని,ఎటువంటి కష్టాలు ఎదురైనా పిల్లలను చదివించడంలో వెనుకడుగు వేయొద్దని. పిల్లల తల్లిదండ్రులను కోరారు.
ఆ గ్రామంలో ఉన్న పిల్లలకు చదువు యొక్క ప్రాధాన్యత ను వివరిస్తూ,చదువుకున్న యువకులందరూ చెడు వ్యసనాలకు గురికాకుండా,
పే బ్యాక్ టు సొసైటీ అనే డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ ఆలోచనతో మీ గ్రామం కోసం… భవిష్యత్తును నిర్ధారించే భావితర పిల్లల విద్యాభివృద్ధి కోసం… రామరాజు ను స్ఫూర్తి తీసుకొని చదువుకున్న యువకులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మీ యొక్క నాలెడ్జ్ ని,సమయం,శ్రమను ఇస్తూ మన ప్రాంతాన్ని అభివృద్ధికి కృషి చేయడం ఎంతో అవసరమన్నారు. సోదరుడు రామరాజు చిన్నన్నప్పుడు నుండి ఎన్నో కష్టాలు,అటకాలు ఎదురైనప్పటికీ,ఆ కష్టాలను దాటుకుంటూ చదువులో రాణిస్తూ,ఆంధ్ర యూనివర్సిటీలో కామర్స్ డిపార్ట్మెంట్ లో పీహెచ్డీ స్కాలర్ గా ఉన్నత చదువును కొనసాగిస్తూ మారుమూల గ్రామంలో పిల్లల విద్యాభివృద్ధికై సేవాలు అందిస్తున్నందుకు ప్రత్యేక అభినందనలు సంఘ అధ్యక్షడు సోమేష్ కుమార్(ఉప సర్పంచ్) తెలిపారు.
ఈ కార్యక్రమంలో పెసా గ్రామ కమిటీ ఉపాధ్యక్షుడు యస్ మురళి,కార్యదర్శి యస్ రాజేష్ కుమార్,వార్డు మెంబర్ గెమ్మెల పాల్స్,మాజీ వార్డ్ మెంబర్ శ్రీరాములు,మన్యపుత్ర యువజన సంఘం ఉపాధ్యక్షుడు పాటి నూకరాజు,పి అర్జున్,యస్ చంద్రశేఖర్,గ్రామస్తులు సుందరరావు(వాలంటర్),సోమరాజు,శ్రీరాములు,రాజేష్, రామ్మూర్తి,రాము, రామారావు, యువకులతో పాటు చిన్నారి పిల్లలు,తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments