
ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్సీ నాగరకుంట నవీన్ రెడ్డి
నిర్వాహకుడు పాశం గణేష్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి
( పయనించే సూర్యుడు అక్టోబర్ 05 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
కొత్తూరు మున్సిపాలిటీలోని చేగూర్ రోడ్డు,తిమ్మాపూర్ పెట్రోల్ బంక్ పక్కన పాశం గణేష్ నూతనంగా ఏర్పాటు చేసిన మన అడ్డా టీ టైం ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్సీ నాగర కుంట నవీన్ రెడ్డి హాజరై మన అడ్డ టీ టైంను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి మాట్లాడుతూ..ప్రభుత్వ ఉద్యోగాలే లక్ష్యం కాకుండా స్వయం కృషితో ఎదగాలన్నారు.ఆర్థికంగా అభివృద్ధి చెందుతూ,మరింత మందికి ఉపాధి కల్పించే స్థాయికి చేరుకోవాలని ఎమ్మెల్సీ పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ డోలి రవీందర్,కౌన్సిలర్స్ చంద్రకళ రాజేందర్ గౌడ్,కౌన్సిలర్లు కోస్గి శ్రీనివాస్,మాధవి గోపాల్ గౌడ్, మాజీ సర్పంచ్లు ఏనుగు జనార్దన్ రెడ్డి,మాధవ రెడ్డి,మాజీ ఎంపిటిసి నర్సిములు గౌడ్ నాయకులు పెద్దాపురంకృష్ణయ్య,నాగరాజు,భాస్కర్ మిస్కిల్,అక్కి వానిగూడ వానిగూడ రాజు తదితరులు పాల్గొన్నారు.
