పయనించే సూర్యుడు జిల్లా ఇంచార్జ్ శ్రీకాంత్ (20: జనవరి) (ఆదోనినియోజకవర్గ)రాష్ట్ర భవిష్యత్తు కోసం మంత్రి నారా లోకేష్ కి ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి ఎం హెచ్ పి ఎస్ తరపునవిజ్ఞప్తి చేస్తున్నాము.
చిన్న వయసులోనే తెలుగు దేశం పార్టీతో ఎంతో రాజకీయ అనుభవం సంపాదించిన నారా లోకేష్ పరిపాలన పరంగా మరింత అనుభవం సంపాదించే అవకాశాలు పొందాలని పార్టీ కార్యకర్తలు,రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా యువత కోరుకుంటున్నారు.యువగళం పాదయాత్ర ద్వారా తన పోరాట పటిమను నిరూపించుకున్న లోకేష్ తండ్రి చంద్రబాబు గత ముఖ్యమంత్రి జగన్ రెడ్డి తప్పుడు కేసులు పెట్టి జైలులో పెట్టినా, తండ్రి విడుదల కోసం ఆయన పడిన తాపత్రయం,పార్టీని కాపాడుకున్న తీరు స్పూర్తిదాయకం.
విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ తెస్తున్న సంస్కరణల వల్లవిద్యార్థుల పై భారం తగ్గి వారికి నాణ్యమైన విద్య అందుతోంది. అదేవిధంగా ఉపాధ్యాయులు సైతం పూర్తిగా బోధన పైనే దృష్టి పెట్టేవిధంగా ప్రణాళిక రూపొందించి విద్యా ప్రణాళిక లో ఇతర రాష్ట్రాలకు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మార్గదర్శిగా నిలుస్తున్నారు.తమను రక్షించాలని వేడుకునేగల్ఫ్ దేశాలలో చిక్కుకున్న తెలుగు ప్రజలను తిరిగి మన దేశానికి తీసుకొని రావటానికి ఆయన చేసిన, చేస్తున్న కృషి నభూతో నభవిష్యత్.
మన దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ తోను, విదేశీ రాజులు, అధికారులతోనూ చర్చించి బాధితులను మన దేశానికి రప్పించి వారిని వారి కుటుంబం చెంతకు చేర్చి వారి ముఖాలలో సంతోషాలు వెల్లి విరిసేందుకు కారకులు కావటం లోకేష్ మానవతా హృదయానికి, మానవసేవకు మచ్చుతునక, తన బాధ్యతల పట్ల అంకితభావానికి నిదర్శనం.విదేశాంగ విధానాలలో ఆయన సాధించిన పట్టుకు తార్కాణం.
ఇంత అద్భుతమైన నాయకుడైన నారా లోకేష్ ఉపముఖ్యమంత్రిని చేస్తే రాష్ట్రానికి ఎంతో మేలు జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు విశ్వసిస్తున్నారు. కావున నారా లోకేష్ కి ఉపముఖ్యమంత్రి పదవిని ఇచ్చి పరిపాలన, ప్రజా సేవలో ఆయన మరింత ముందుకు వెళ్ళేలా ప్రోత్సహించాలని మరొక్కసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి యం.హెచ్.పి.సమితి తరపున విజ్ఞప్తి చేస్తున్నాము.- ఎ.నూర్ అహ్మద్- మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి.