ప్రకృతి వ్యవసాయం రైతు సంకల్పం..
పయనించే సూర్యుడు// జనవరి 12// హుజురాబాద్ నియోజకవర్గ ఇన్చార్జ్ // కుమార్ యాదవ్..
గ్రామ నవ నిర్మణ్ సమితి జి ఎన్ ఎన్ ఎస్, కెవికె ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయం ప్రాజెక్టు లో భాగంగా “వారు మాట్లాడుతూ..మన ఇంటి మందం మన పంట” (ప్రకృతి వ్యవసాయం )అనే సంకల్పంతో రసాయన ఎరువులు వాడకుండా ప్రకృతి తయారు చేసినటువంటి సహజ వనరులతో వ్యవసాయం చేయాలని ముఖ్య ఉద్దేశంతో మన ఆరోగ్యాలను కాపాడాలని మన ముందు తరాలకు మనం చరిత్రగా మిగలాలని దీని ముఖ్య ఉద్దేశం అన్నారు.ఇందులో భాగంగా ఇల్లంతకుంట మండలం కనగర్తి గ్రామంలో దరువుల కనకయ్య అనే రైతు ముందుకు వచ్చి ప్రకృతి వ్యవసాయంలో భాగమైనారు అని తెలిపారు.దీనిలో భాగంగా ఎకరం వ్యవసాయ భూమిలో జీవామృతం (ఆవు పేడ, ఆవు మూత్రం, బెల్లం, పప్పులపిండి, రసాయనాలు కలపని మట్టి లేదా పుట్ట మట్టి ) తయారు చేయించి తన ఎకరం భూమికి పారించడం జరిగింది అని అన్నారు.దీనివల్ల భూమిలో ఉన్న పాజిటివ్ సూక్ష్మజీవులన్నీ భూమి పైకి వచ్చి మరియు భూమి యొక్క సాంద్రత నీ పెంచి పంట ఏపుగా ఎదిగేలా సహాయపడుతుంది అని వివరించారు.దీనివల్ల మనకు ఆరోగ్య సమస్యలు కూడా తగ్గుముఖం పడతాన్నారు.ఈ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్టు కోఆర్డినేటర్ కుమారస్వామి , ఫీల్డ్ స్టాఫ్ అజయ్ బొమ్మిదేని , అకేంద్ర, మమత, రైతులు పాల్గొన్నారు.