
పయనించే సూర్యడు: ఏప్రిల్ 03: ములుగు జిల్లా వాజేడు మండల ప్రతినిధి.రామ్మూర్తి.ఎ.
వాజేడు : ములుగు జిల్లా వాజేడు మండలంలో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు వివిధ కారణాలతో మరణించిన వారి కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు. ఈసందర్భంగా వాజేడు ఈనాడు రిపోర్టర్ నరసింహరావు తల్లి మరణించగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.అంతే కాకుండా వాజేడు మండలం సుందరయ్య కాలనీ వాసి, హైదరాబాద్ ఫ్లై ఓవర్ నుంచి దూకి చనిపోయిన సాయి ప్రసాద్ కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. గత రెండు వారాల క్రితం వెంకటాపురం మండలంలో మొక్కజొన్న పంట వేసి నష్టపోయిన రైతు ఆత్మహత్య చేసుకోగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పి, ప్రభుత్వం ద్వారా నష్టపరిహారాన్ని వచ్చే విధంగా కృషి చేస్తానని హామి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వాజేడు మండల అధికారులు, మండల కాంగ్రెస్ నాయకులు, నూగూరు,చర్ల వ్యవసాయ శాఖ మార్కెట్ వైస్ చైర్మన్ పూనెంరాంబాబు, ములుగు జిల్లాకాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, విక్రాంత్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు ప్రసాదు బాబు రాజు మరియు కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, గ్రామస్తులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
