
పయనించే సూర్యుడు మే02 టేకులపల్లి ప్రతినిధి (పొనకంటి ఉపేందర్ రావు )
టేకులపల్లి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ భాస్కర్ నాయక్ మరియు స్థానిక వైద్యాధికారి డాక్టర్ కందుల దినేష్ ఆదేశానుసారం మలేరియా ప్రభావిత గ్రామాలైన మోట్ల గూడెం మరియు జంగాలపల్లి గ్రామాలలోని ప్రజలలో మలేరియా నివారణకు తీసుకునే ముందస్తు చర్యలలో భాగంగా అక్కడి ప్రజల్లో మలేరియా పారాసైట్ కనుగొనడానికి ప్రత్యేక రక్త నమూనాల సేకరణ కార్యక్రమం ఈరోజు ఇల్లందు సబ్ యూనిట్ అధికారి హరికృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ప్రజలకు మలేరియా పై అవగాహన కల్పిస్తూ తలనొప్పి చలితో కూడిన విపరీతమైన జ్వరం వణుకుడు జ్వరం తగ్గిపోయాక విపరీతమైన చెమటలు మరియు నీరసం మలేరియా ప్రధాన లక్షణాలని పై లక్షణాలు ఉంటే వెంటనే వైద్య సిబ్బందిని సంప్రదించి పరీక్షలు చేయించుకొని వ్యాధి నిర్ధారణ జరిగితే వెంటనే ప్రభుత్వ ఆసుపత్రిలో లభించే ఉచిత చికిత్స తీసుకుంటే ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా కాపాడుకోవచ్చు అని లేదంటే ఫ్యాల్సిపెరం మలేరియా వల్ల ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వస్తుందని అలాగే మలేరియా వచ్చిన వ్యక్తిని కుట్టిన ఆడ అనాఫిలిస్ దోమ ఆరోగ్యవంతులని కుట్టడం ద్వారా మలేరియా మిగతా ప్రజలకు కూడా త్వరితగతిన వ్యాపించే అవకాశం ఉందని కాబట్టి ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకొని ఎటువంటి నీటి నిల్వలను లేకుండా ఇంటి చుట్టూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని దోమ పెరగకుండా మరియు పెరిగిన దోమ కుట్టకుండా చేసుకోవడం ద్వారా దోమకాటు ద్వారా వచ్చేమలేరియా డెంగ్యూ చికెన్ గున్యా బోధకాలు మెదడువాపు జికా వంటి వ్యాధులు రాకుండా కాపాడుకోవచ్చు అని ఈ సందర్భంగా ప్రజలకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ నాగు బండి వెంకటేశ్వర్లు ధనసరి రాంబాబు ఇర్ఫా నాగలక్ష్మి స్రవంతి మానస అరుణాదేవి ఆశా కార్యకర్తలు రాంబాయి కవిత మంగమ్మ శిరోమణి వెంకటరమణ లక్ష్మీ నరసమ్మ శారద కమలా బాయి తదితరులు పాల్గొన్నారు